• waytochurch.com logo
Song # 3752

yaesu maaradu yaesu maaradu vishvammtha maarinanu maatathappaduయేసు మారడు యేసు మారడు విశ్వమంత మారినను మాటతప్పడు



Reference: యెహోవానైన నేను మార్పులేనివాడను. మలాకీ Malachi 3:6

1. యేసుని నిత్యము స్తుతియించెదము
భూమి ఆకాశము సృజించినాడు
మనలో దేవుని సంకల్పము
యేసుని బయలు పరచుటయే

పల్లవి: యేసు మారడు యేసు మారడు
విశ్వమంత మారినను మాటతప్పడు

2. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో
అందరిని ప్రభు నిర్ణయించెను
పొందుగ పిలిచి నీతిగా తీర్చె
సుందరముగా మహిమపర్చు

3. చేసెను మనలను తన రూపమున
బాసెను పాపముచే నా రూపం
యేసులో నొసగె మరల మనకు
వాసిగ కాచును పుత్రులుగా

4. దేవుని ప్రేమించు వారందరికి
భువిలో జరుగునన్ని మేలుకై
కావవి ఎన్నదగిన శ్రమలు
భావి మహిమతో పోల్చుటకై

5. శ్రమయు బాధ హింసయైనను
కరువు వస్త్రహీనతయును
ఉపద్రవమైనను ఖడ్గమైనను
ఎడబాపునే ప్రభు ప్రేమనుండి

6. మరణము జీవమైనను
దేవదూతలు ప్రధానులు
అధికారులు మరి ఎవరైనను
ఎడబాపరు ప్రభు ప్రేమనుండి

7. ఆనాది దేవుని ఆ సంకల్పం
మనలో ప్రభుని బయలుపరప
మనవలెను మన పాపములు
పూనికతో పూర్ణ ఐక్యతకు



Reference: yehoavaanaina naenu maarpulaenivaadanu. malaakee Malachi 3:6

1. yaesuni nithyamu sthuthiyiMchedhamu
bhoomi aakaashamu srujiMchinaadu
manaloa dhaevuni sMkalpamu
yaesuni bayalu parachutayae

Chorus: yaesu maaradu yaesu maaradu
vishvamMtha maarinanu maatathappadu

2. eMdharini prabhu muMdhu erigenoa
aMdharini prabhu nirNayiMchenu
poMdhuga pilichi neethigaa theerche
suMdharamugaa mahimaparchu

3. chaesenu manalanu thana roopamun
baasenu paapamuchae naa roopM
yaesuloa nosage marala manaku
vaasiga kaachunu puthrulugaa

4. dhaevuni praemiMchu vaarMdhariki
bhuviloa jarugunanni maelukai
kaavavi ennadhagina shramalu
bhaavi mahimathoa poalchutakai

5. shramayu baaDha hiMsayainanu
karuvu vasthraheenathayunu
upadhravamainanu khadgamainanu
edabaapunae prabhu praemanuMdi

6. maraNamu jeevamainanu
dhaevadhoothalu praDhaanulu
aDhikaarulu mari evarainanu
edabaaparu prabhu praemanuMdi

7. aanaadhi dhaevuni aa sMkalpM
manaloa prabhuni bayaluparap
manavalenu mana paapamulu
poonikathoa poorNa aikyathaku



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com