• waytochurch.com logo
Song # 3756

paravaasini nae jagamuna prabhuvaa nadachuchunnaanu naa dhaarinపరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్



Reference: నీ దృష్టికి అతిధివంటి వాడను నా పితరులందరివలె నేను పరవాసినై యున్నాను కీర్తన Psalm 39:12

పల్లవి: పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నా దారిన్
నాగురి నీవే నా ప్రభువా - నీదరి నేజేరెదను - నేను

1. లోకమంతా నాదనియెంచి - బంధుమిత్రులే ప్రియులను కొంటిని
అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును - ఇలలో

2. ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమున
పాపమునిండె జగములో - శాపముచేకూర్చుకొనె - లోకము

3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో
తెలుపుము యెంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను

4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణ పొందితివనగా - మహానందము కలిగె - నాలో

5. యాత్రికుడ నే నీలోకములో - సిలువమోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగ - పొందితిని నేను - యేసునే

6. నా నేత్రములు మూయబడగ - నాదు యాత్ర ముగియునిలలో
చేరుదున్ పరలోక దేశము - నాదు గానము యిదియే - నిత్యము



Reference: nee dhruShtiki athiDhivMti vaadanu naa pitharulMdharivale naenu paravaasinai yunnaanu keerthana Psalm 39:12

Chorus: paravaasini nae jagamuna prabhuvaa - nadachuchunnaanu naa dhaarin
naaguri neevae naa prabhuvaa - needhari naejaeredhanu - naenu

1. loakamMthaa naadhaniyeMchi - bMDhumithrulae priyulanu koMtini
aMthayu moasamaegaa - vyarThamu sarvamunu - ilaloa

2. Dhana sMpadhalu gauravamulu - dhahiMchipoavu neeloakamun
paapamuniMde jagamuloa - shaapamuchaekoorchukone - loakamu

3. thelupumu naa aMthamu naaku - thelupumu naa aayuvu yeMthoa
thelupumu yeMtha alpudanoa - virigi naligi yunnaanu - naenu

4. aa dhinamu prabhu gurtherigithini - nee rakthamuchae maarchabadithini
kShmaapaNa poMdhithivanagaa - mahaanMdhamu kalige - naaloa

5. yaathrikuda nae neeloakamuloa - siluvamoayuchu saagedhanilaloa
amoolyamaina Dhanamuga - poMdhithini naenu - yaesunae

6. naa naethramulu mooyabadaga - naadhu yaathra mugiyunilaloa
chaerudhun paraloaka dhaeshamu - naadhu gaanamu yidhiyae - nithyamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com