paravaasini nae jagamuna prabhuvaa nadachuchunnaanu naa dhaarinపరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్
Reference: నీ దృష్టికి అతిధివంటి వాడను నా పితరులందరివలె నేను పరవాసినై యున్నాను కీర్తన Psalm 39:12పల్లవి: పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నా దారిన్ నాగురి నీవే నా ప్రభువా - నీదరి నేజేరెదను - నేను1. లోకమంతా నాదనియెంచి - బంధుమిత్రులే ప్రియులను కొంటినిఅంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును - ఇలలో2. ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమునపాపమునిండె జగములో - శాపముచేకూర్చుకొనె - లోకము3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతోతెలుపుము యెంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితినిక్షమాపణ పొందితివనగా - మహానందము కలిగె - నాలో5. యాత్రికుడ నే నీలోకములో - సిలువమోయుచు సాగెదనిలలోఅమూల్యమైన ధనముగ - పొందితిని నేను - యేసునే6. నా నేత్రములు మూయబడగ - నాదు యాత్ర ముగియునిలలోచేరుదున్ పరలోక దేశము - నాదు గానము యిదియే - నిత్యము