ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు
israelunu kaapaadu devudu
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా

1. ఇత్తడి తలుపులను ఇనుప గడియలను - మా దేవుడే పగులగొట్టును
మా ముందర ఆయన నడుచును - ఈ భూమిని మేం స్వతంత్రించను -2
రహస్యమందలి ఆత్మల ధనము - ప్రపంచపు కోట్లాది జనము -2
మాకు సొత్తుగా స్వాస్థ్య ధనముగా - ఇచ్చెను ప్రభువు ఇది సత్యం ఆమెన్
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
2. జలములలో బడి మేము దాటిన - అగ్నిలో బడి మేం నడచినా
ఏ అపాయము మా దరి చేరదు - యేసు రక్తపు కవచముండగా -2
ఎడారి నేలను సెలయేళ్ళుగా - అరణ్య భూమిని నీటి మడుగుగా -2
చేయును ప్రభువు కుమ్మరించి - కడవరి వర్షము ఇది సత్యం ఆమెన్
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
3. పగలు ఎండైనా రాత్రి వెన్నెలైన - ఏ దెబ్బైన తగులనియ్యడు
చీకటి బాణమైనా ఏ తెగులైనా - మా గు-డారమును చేరనీయడు -2
మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గములలో మాకు తోడుండగా
మా పాదములకు రాయి తగులకుండగా - మా మార్గమంతటిలో తోడుండగా
తన దూతలకు ఆజ్ఞాపించును - మాకై ప్రభువు ఇది సత్యం ఆమెన్
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
4. మాకు విరోధముగా రూపింపబడిన - ఏ ఆయుధము వర్ధిల్లదు
మా మార్గము అంతకంతకు - దైవ మహిమతో వర్ధిల్లును -2
మా తలలపై నిత్యానందము - మా నోటిలోను తన గీతము -2
ఉంచెను ప్రభువు అభిషేకించి - తన మహిమార్ధం ఇది సత్యం ఆమెన్
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
5. సడలిన చేతులను తొట్రిల్లు మోకాళ్ళను - యేసుని పేరిట బలపరచెదం
తత్తరిల్లు హృదయాలను మీ ప్రభు వచ్చెనని - ధైర్యముగుండమని దృడపరిచెదం -2
సాతాను కాడిని విరగగొట్టెదం - దుర్మార్గ కట్లను మేం విప్పేదం -2
అగ్ని నుండి జనముల లాగి - ప్రభువును చూపెదం ఇది సత్యం ఆమెన్
భూమి మారినా జలములు పొంగినా కొండలు కదిలినా భయము లేదుగా
మారని దేవుడు విడువని నాధుడు యేసు ప్రభువె మాకు తోడుగుండగా
ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడెన్నడు -2
6. నరులను పట్టేటి జాలరులుగా మేం - దైవ రాజ్యపు వలలు విసురుతాం
యేసు రక్తమే పాపము కడుగునని - సర్వ లోకానికి చాటి చెప్పుతాం -2
రారాజుకు రాయబారులం మేము - క్రీస్తేసుతో జత పనివారము -2
యేసు నందలి ఆ నందమే - మాకు బలము ఇది సత్యం ఆమెన్