• waytochurch.com logo
Song # 3761

yaesae manakila svaasthyamu vaerae svaasthyamu laedhikanuయేసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము లేదికను



Reference: వారికి స్వాస్థ్య మేదనగా.... నేనే వారికి స్వాస్థ్యము యెహెజ్కేలు Ezekiel 44:28

పల్లవి: యేసే మనకిల స్వాస్థ్యము
వేరే స్వాస్థ్యము లేదికను

1. అక్షయమును నిర్మలమైన
వాడబారని స్వాస్థ్యము మనకు
కరుణతో నొసగెను దేవుడు
హర్షముతో స్తుతియించెదము

2. మనము క్రీస్తుని సంబంధులము
వాగ్దానముతో వారసులముగా
చేయబడితిమి స్థిరముగా
చేతులెత్తి పూజించెదము

3. దేవుని సంకల్పమును బట్టి
మనలను ముందే నిర్ణయించి
మనకొక స్వాస్థ్యము నేర్పరచెన్
మనసార మరి పాడెదము

4. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను
పాలుపొందుటకు పాత్రుల జేసిన
పరమ తండ్రికి స్తోత్రములు
నిరతంబును చెల్లించెదము

5. క్షేమమును మరి అభివృద్ధియును
కలుగ జేయుటకు శక్తిమంతుడు
స్వాస్థ్యము నిచ్చిన దేవునికి
హల్లెలూయ పాడెదము



Reference: vaariki svaasThya maedhanagaa.... naenae vaariki svaasThyamu yehejkaelu Ezekiel 44:28

Chorus: yaesae manakila svaasThyamu
vaerae svaasThyamu laedhikanu

1. akShyamunu nirmalamain
vaadabaarani svaasThyamu manaku
karuNathoa nosagenu dhaevudu
harShmuthoa sthuthiyiMchedhamu

2. manamu kreesthuni sMbMDhulamu
vaagdhaanamuthoa vaarasulamugaa
chaeyabadithimi sThiramugaa
chaethuleththi poojiMchedhamu

3. dhaevuni sMkalpamunu batti
manalanu muMdhae nirNayiMchi
manakoka svaasThyamu naerparachen
manasaara mari paadedhamu

4. parishudhDhula svaasThyamuloa manalanu
paalupoMdhutaku paathrula jaesin
parama thMdriki sthoathramulu
nirathMbunu chelliMchedhamu

5. kShaemamunu mari abhivrudhDhiyunu
kaluga jaeyutaku shakthimMthudu
svaasThyamu nichchina dhaevuniki
hallelooya paadedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com