• waytochurch.com logo
Song # 3779

naenae bhayapada valadhani palikenu mana rakshkudu yaesuprabhuనేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసుప్రభు



Reference: మీకు కృపయు సమాధానమును విసతరించునుగాక 2 పేతురు Peter 1:3

పల్లవి: నేనే భయపడ వలదని పలికెను
మన రక్షకుడు యేసుప్రభు

1. తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగా
తనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు

2. శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగి
విశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు

3. నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకు
కరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు

4. మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్
త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ

5. ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచో
వింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె

6. నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమును
ముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము



Reference: meeku krupayu samaaDhaanamunu visathariMchunugaaka 2 paethuru Peter 1:3

Chorus: naenae bhayapada valadhani palikenu
mana rakShkudu yaesuprabhu

1. thana samaaDhaanamu nee kichchi - krupala nennoa choopenugaa
thanivi theera sthuthi chelliMchumu - thanadhu praemadhayakoraku

2. shaashvathMbagu jaalijoopi - shaashvatharakShNa nosagi
vishvaasamuthoa nilachina yedala - shaashvatha raajyM bosagu

3. narudukaadu dhaevudathadu - narudu aayenu nee koraku
karuNathoa ninu rakShiMchutaku - sarvamichchenu shree yaesu

4. maraNiMchenu prabhu nee korakae - thirigi laechenu kaapaadan
thvaraga vachchunu kanipettumu - nirathamaayanathoanuMd

5. eMtha paapivaina nilaloa - chiMtha laedhika namminachoa
viMtha rakShkudaesu prabhuvu - svMtha praaNamunarpiMche

6. needhuyaathraloa balamichchutaku - thanadhu dhaeharakthamunu
mudhamuthoa arpiMchina prabhukae - hallelooyaa paadumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com