• waytochurch.com logo
Song # 3783

prabhoo nee vaadanu neevu naa prabhudavani nee korakai jeevimthunuప్రభూ నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును



Reference: జీవించువారిక మీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెను 2 కొరింథీ Corinthians 5:15

పల్లవి: ప్రభూ నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును
మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను

1. ప్రభువా యెరిగితిని లోకమంత మోసమని
చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో
కృతజ్ఞత కలిగి (2) - నీవైపే చూచెదను
నీయందే నిలిచి యుండి నీయాజ్ఞల పాలింతును

2. నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను
నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును
నెమ్మదిని పొంది యిల (2) కన్నీరు - కార్చనిక
నీవే నా సర్వమని నీయందే బలపడెద

3. యేసుని సిలువజూచి విజయమును పొందెదను
సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని
నిన్ను నే నమ్మెదను (2) - నీతోనే సాగెదను
నీ రెక్కలచాటు నేనుండ భయపడను

4. మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను
మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు
రక్షకుని చూఛెదను (2) - నన్నాయన చేర్చుకొనున్
తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను

5. అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి
దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను
నే సంతసించెదను (2) - ప్రభువుతోడ నుండెదను
నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును



Reference: jeeviMchuvaarika meedhata thamakoraku kaaka, thama nimiththamu mruthipoMdhi thirigi laechinavaani korakae jeeviMchutaku aayana aMdharikoraku mruthipoMdhenu 2 koriMThee Corinthians 5:15

Chorus: prabhoo nee vaadanu neevu naa prabhudavani nee korakai jeeviMthunu
migilina jeevithamunu nee korakae gadipedhanu

1. prabhuvaa yerigithini loakamMtha moasamani
choopithivi samaaDhaana nireekShNa naa kilaloa
kruthajnYtha kaligi (2) - neevaipae choochedhanu
neeyMdhae nilichi yuMdi neeyaajnYla paaliMthunu

2. naa muMdhu nadichae prabhoo ninnu veMbadiMchedhanu
neevu naa thoadanuMda marachedhanu dhuHkhamunu
nemmadhini poMdhi yila (2) kanneeru - kaarchanik
neevae naa sarvamani neeyMdhae balapadedh

3. yaesuni siluvajoochi vijayamunu poMdhedhanu
sahiMthunu sMthasamuga nee koraku anniMtini
ninnu nae nammedhanu (2) - neethoanae saagedhanu
nee rekkalachaatu naenuMda bhayapadanu

4. maraNanadhi yodhdhaku sMthasamuga vachchedhanu
mruthyuvu baarinuMdi jeevamunaku dhaatiMthuvu
rakShkuni chooChedhanu (2) - nannaayana chaerchukonun
thakShNamae thana roopamunaku maarpucheMdhedhanu

5. agamya jyoathiyMdhu ghanamuga nae pravaeshiMchi
dhoothalu, parishudhDhulu, bhakthulanae choochedhanu
nae sMthasiMchedhanu (2) - prabhuvuthoada nuMdedhanu
nireekShNa yidhiyae aayanathoa naenuMdhunu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com