naa neethi neeve నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయా
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా నదులంత తైలం విస్తార బలులు - నీకిచ్చినా చాలవయ్యా నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా 1. నా దీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా నా దోష శిక్ష భరియించి నీవు - నను నీలొ దాచావుగా ఏమంత ప్రేమ నామీద నీకు - నీ ప్రానమిచ్చావుగా నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవెగా.... ఆ ఆ అ హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా 2. నా ప్రియులే నన్నువెలివేసినప్పుడు - నివు చేరదీశావుగా నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి - కన్నీరు తుడిచావుగా నేనున్న నీకు భయమేల నంటూ - ఓదార్పునిచ్చావుగా చాలయ్య దేవా నీ కృపయే నాకు - బ్రతుకంతయు పండుగా.... ఆ ఆ అ హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయా3. హా ఊబిలోనా నే చిక్కినపుడు - నీవు నన్ను చూశావుగా నీ చేయి చాపి నను పైకి లేపి - నీ వాక్కు నిచ్చావుగా నా సంకటములు నా ఋణపు గిరులు - అన్నిటిని తీర్చావుగా నీలోన నాకు నవజీవమిచ్చి - నీ సాక్షిగ నిలిపావుగా.... ఆ ఆ అ హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2నా నీతి నీవే నా ఖ్యాతి నీవే - నా దైవమా యేసయా నా క్రియలు కాదు నీ కృపయే దేవా - నా ప్రానమా యేసయానదులంత తైలం విస్తార బలులు - నీకిచ్చినా చాలవయ్యా నీ జీవితాన్నే నాకిచ్చినావు - నీకే నా జీవమయ్యా హలెలూయా ఆమెన్ హలెలూయా - హలెలూయా ఆమెన్ హలెలూయా -2