• waytochurch.com logo
Song # 3799

yaesuni nimdhanu bharimchi aayana yodhdhaku velludhamuయేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము



Reference: కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము హెబ్రీ Hebrews 13:13

పల్లవి: యేసుని నిందను భరించి
ఆయన యొద్దకు వెళ్ళుదము

1. సంబల్లటు టోబీయా చేయు హేళనలు
వారలు పెట్టు శ్రమల భరించి
ఆయనతో సంతోషముగ భరించి
బయలుదేరి వెళ్ళుదము

2. స్తెఫను చావును మదిలో దలచి
పేతురు చెఱలో నుండుట దలచి
మోసము లెన్నియో కల్గినగాని
బయలుదేరి వెళ్ళుదము

3. కపట సోదరుల వలన బాధలు
అపనిందలు మా కెన్నియున్న
యేసు ప్రభువునే ద్వేషించినను
బయలుదేరి వెళ్ళుదము

4. కర్రలతోనే మము కొట్టినను
కత్తులతో మము ఖండించినను
ప్రజల వలన బహుగా నలిగినను
బయలు దేరి వెళ్ళుదము

5. ఉపవాసములతో యున్ననుగాని
జాగరణములతో యున్ననుగాని
దిగంబరత్వముతో మేమున్నన్
బయలుదేరి వెళ్ళుదము

6. అగ్నిలో నడువ వలసిన గాని
పలువిధ శ్రమలు మా పై బడినన్
చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచి
బయలుదేరి వెళ్ళుదము

7. నిబ్బరముగ నిలుచుందుము మేము
యెహోవాయే మా ప పక్షము జేరి
పోరాటములో జయము చేకూర్చున్
హల్లెలూయ పాడుదము



Reference: kaabatti manamaayana niMdhanu bhariMchuchu shibiramu velupaliki aayana yodhdhaku veLLudhamu hebree Hebrews 13:13

Chorus: yaesuni niMdhanu bhariMchi
aayana yodhdhaku veLLudhamu

1. sMballatu toabeeyaa chaeyu haeLanalu
vaaralu pettu shramala bhariMchi
aayanathoa sMthoaShmuga bhariMchi
bayaludhaeri veLLudhamu

2. sthephanu chaavunu madhiloa dhalachi
paethuru cheRaloa nuMduta dhalachi
moasamu lenniyoa kalginagaani
bayaludhaeri veLLudhamu

3. kapata soadharula valana baaDhalu
apaniMdhalu maa kenniyunn
yaesu prabhuvunae dhvaeShiMchinanu
bayaludhaeri veLLudhamu

4. karralathoanae mamu kottinanu
kaththulathoa mamu khMdiMchinanu
prajala valana bahugaa naliginanu
bayalu dhaeri veLLudhamu

5. upavaasamulathoa yunnanugaani
jaagaraNamulathoa yunnanugaani
dhigMbarathvamuthoa maemunnan
bayaludhaeri veLLudhamu

6. agniloa naduva valasina gaani
paluviDha shramalu maa pai badinan
chMpabadina goRRepillanu joochi
bayaludhaeri veLLudhamu

7. nibbaramuga niluchuMdhumu maemu
yehoavaayae maa pa pakShmu jaeri
poaraatamuloa jayamu chaekoorchun
hallelooya paadudhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com