• waytochurch.com logo
Song # 382

lokamunu jayinchina లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే


లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
లోకమును జయించిన విజయము విశ్వాసమే - ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే

1. ఆవగింజంత విశ్వాసం - నీలో ఉంటే .... (హే) -2
కొండలైనా కదులును - సంద్రమైన చీలును
గాలైన అణగి దెయ్యమైనా వదలి - యేసునకే మహిమ తెచ్చును
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... ఏ

2. నమ్మిన నీవు దేవుని - మహిమ చూస్తావు ... (హూ)- 2
మృతులను లేపెడి - యేసు రాజే జీవము
మృతమైన లోక జనులను లేప - యేసు వలే సాగి పోవుదాం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే.... హే

3. లేని వాటిని ఉన్నట్టు - పిలుచును ప్రభువు..... (హూ )-2
విశ్వసించి పలుకుదాం - క్రియలను చూపుదాం
జీవవాక్కు పలికి ఆత్మ శక్తి చూపి - గొప్ప గొప్ప పనులు చేయుదాం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే

4. నమ్ము వానికి సమస్తం - సాధ్యమే ప్రభుతో ..... (హో) - 2
ప్రభువు ఉన్నాడని - ఫలము ఇస్తాడని
నీకై ప్రాణం పెట్టి మృతి గెల్చాడన్న వార్త నమ్ము- నీదె జీవం
విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది యేసే -2
లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే... హే


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com