• waytochurch.com logo
Song # 3821

nee dhaevuni sannidhini kanabadanu neevu sidhdhapadumaaనీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా



Reference: మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి ఆమోసు Amos 4:12

పల్లవి: నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా

1. నీ యౌవనములో నీ హృదయమును
సంతృప్తిగా నుండనిమ్ము
అయితే వీటిని బట్టి దేవుడు
తీర్పులోనికి తెచ్చు నిన్ను

2. దుర్దినంబులు రాకముందే
వాటిలో సంతోషము లేదని
చెప్పుసమయము రాకమునుపే
సృష్టికర్తను స్మరియించుమా

3. నీ యౌవన జీవితమును బట్టి
తృణీకారము నొందకుమా
ప్రభువును బోలి నడచుకొనుమా
మాదిరి కరముగా జీవించుమా

4. వినయ విధేయత కలిగి యుండి
ఒకరి నొకరు యోగ్యులుగా
మన్నన చేయుచు పరుల కార్యముల
స్వకార్యముల వలె భావించుమా

5. ప్రేమ సంతోష సమాధానము
దీర్ఘ శాంత దయాళుత్వము
మంచితనము సాత్వీక విశ్వాసము
కలిగి యుండి జీవించుమా

6. మేలు చేయుట యందు నీవు
విసుగక యుండుము యెల్లప్పుడు
సహనముతో ప్రభు సేవ చేసిన
ఫలము ననుభవించెదవు

7. హల్లెలూయా పాటలు పాడుచు
ఎల్లప్పుడు ప్రభు రాకడకై
ఉల్లమునందు సంతసించుచు
పాడుము ప్రభునకు హల్లె లూయా



Reference: mee dhaevuni sanniDhini kanabadutakai sidhDhapadudi aamoasu Amos 4:12

Chorus: nee dhaevuni sanniDhini - kanabadanu neevu sidhDhapadumaa

1. nee yauvanamuloa nee hrudhayamunu
sMthrupthigaa nuMdanimmu
ayithae veetini batti dhaevudu
theerpuloaniki thechchu ninnu

2. dhurdhinMbulu raakamuMdhae
vaatiloa sMthoaShmu laedhani
cheppusamayamu raakamunupae
sruShtikarthanu smariyiMchumaa

3. nee yauvana jeevithamunu batti
thruNeekaaramu noMdhakumaa
prabhuvunu boali nadachukonumaa
maadhiri karamugaa jeeviMchumaa

4. vinaya viDhaeyatha kaligi yuMdi
okari nokaru yoagyulugaa
mannana chaeyuchu parula kaaryamul
svakaaryamula vale bhaaviMchumaa

5. praema sMthoaSh samaaDhaanamu
dheergha shaaMtha dhayaaLuthvamu
mMchithanamu saathveeka vishvaasamu
kaligi yuMdi jeeviMchumaa

6. maelu chaeyuta yMdhu neevu
visugaka yuMdumu yellappudu
sahanamuthoa prabhu saeva chaesin
phalamu nanubhaviMchedhavu

7. hallelooyaa paatalu paaduchu
ellappudu prabhu raakadakai
ullamunMdhu sMthasiMchuchu
paadumu prabhunaku halle looyaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com