• waytochurch.com logo
Song # 3824

yauvanulaaraa mee yauvanamuloa smthasimchudiయౌవనులారా మీ యౌవనములో సంతసించుడి



Reference: యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము ప్రసంగి Ecclesiastes 11:9

పల్లవి: యౌవనులారా! మీ యౌవనములో సంతసించుడి
అయితే మీ పనులను బట్టి మీకు - తీర్పు కలుగును

1. కీడుకై పరిగెత్తెడు మీ పాదములను
క్రీస్తే సనెడు బండపై నిలిపియుంచి
సిద్ధ మనస్సనెడు జోడు మీరు తొడుగుకొని
రక్షణ సమాచారమును ప్రచురించుడి

2. అపవిత్రతతో నిండిన మీ హస్తములను
ఆ యేసయ్య రక్తములో కడుగుకొని
పవిత్రమైన చేతులను ప్రభువైపు చాపి
పరిశుద్ధాలయమునందు ప్రార్థించుడి

3. నరకమున బడద్రోయ గలిగిన మీదు
నాలుకలను భద్రముగా చేసికొనుచూ
స్తుతియించుడి కీర్తించుడి ప్రభుయేసుని
అతిప్రియమున మీ నాలుకలతో ఎల్లప్పుడు

4. అభ్యంతర పరచెడు మీ నేత్రములను
ఆశ్రయ దుర్గముపై స్థిరపరచి
మహిమాత్మతో రక్షణకర్తయగు క్రీస్తుని
మహిమను చూచుటకు ఉపయోగించుడి

5. హితబీధను సహింపని మీ దురద చెవులను
కల్పన కథల వైపునకు త్రిప్పకుండ
చల్లని మెల్లని ప్రభుయేసు స్వరమును
సత్యము వినుటకు మీ చెవులనియ్యుడి



Reference: yauvanudaa, nee yauvanamMdhu sMthoaShpadumu prasMgi Ecclesiastes 11:9

Chorus: yauvanulaaraa! mee yauvanamuloa sMthasiMchudi
ayithae mee panulanu batti meeku - theerpu kalugunu

1. keedukai parigeththedu mee paadhamulanu
kreesthae sanedu bMdapai nilipiyuMchi
sidhDha manassanedu joadu meeru thodugukoni
rakShNa samaachaaramunu prachuriMchudi

2. apavithrathathoa niMdina mee hasthamulanu
aa yaesayya rakthamuloa kadugukoni
pavithramaina chaethulanu prabhuvaipu chaapi
parishudhDhaalayamunMdhu praarThiMchudi

3. narakamuna badadhroaya galigina meedhu
naalukalanu bhadhramugaa chaesikonuchoo
sthuthiyiMchudi keerthiMchudi prabhuyaesuni
athipriyamuna mee naalukalathoa ellappudu

4. abhyMthara parachedu mee naethramulanu
aashraya dhurgamupai sThiraparachi
mahimaathmathoa rakShNakarthayagu kreesthuni
mahimanu choochutaku upayoagiMchudi

5. hithabeeDhanu sahiMpani mee dhuradha chevulanu
kalpana kaThala vaipunaku thrippakuMd
challani mellani prabhuyaesu svaramunu
sathyamu vinutaku mee chevulaniyyudi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com