• waytochurch.com logo
Song # 3826

prabhuni saeva jaeyarammu oa yauvanudaaప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా



Reference: ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి లూకా Luke 15:22

పల్లవి: ప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా
ప్రబలజేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం
శుభమునిట్టి సేవ జేయ యువ జనాళికిన్

1. యేసు క్రీస్తు సిలువపైని మరణ మాయెను
చేసెను పాపికి గొప్ప విడుదల
నొసగెను మానవులకు నిత్య జీవము
వాసిగ ప్రజలలో తెలియ జేయవా?

2. పాప వస్త్రములను తీసె ప్రభువు క్రీస్తుడు
శాపగ్రాహి యాయెను ఓ యౌవనుడా
కప్పెను రక్షణ వస్త్రము నీకు
తప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ?

3. పాదములకు సువార్తనే చెప్పులొసగెను
హృదయమందు శాంతి ఆనందమొసగెను
శోధనా బాధలెన్నో నీకు వున్ననూ
నాథుని సువార్తను బోధపరచవా?

4. తప్పిపోయినట్టి నిన్ను కనికరించెను
గొప్పవిందు చేసి ఉంగరమును పెట్టెను
తప్పులన్ని మన్నించెను గొప్ప దేవుడు
తప్పక క్షమియించవా నీ విరోధులన్?

5. పరలోకపు బహుమానము నీవు పొందను
పరిశుద్ధుల సహవాసం నీకు శ్రేష్ఠము
పరలోకపు పందెమందు అంతము వరకు
పరుగెత్తవా జీవకిరీటంబు పొందను?



Reference: prashastha vasthramu thvaragaa thechchi veeniki katti, veeni chaethiki uMgaramu petti, paadhamulaku cheppulu thodigiMchudi lookaa Luke 15:22

Chorus: prabhuni saeva jaeyarammu oa yauvanudaa
prabalajaeya prabhu suvaarthakimmu nee balM
shubhamunitti saeva jaeya yuva janaaLikin

1. yaesu kreesthu siluvapaini maraNa maayenu
chaesenu paapiki goppa vidudhal
nosagenu maanavulaku nithya jeevamu
vaasiga prajalaloa theliya jaeyavaa?

2. paapa vasthramulanu theese prabhuvu kreesthudu
shaapagraahi yaayenu oa yauvanudaa
kappenu rakShNa vasthramu neeku
thappaka prakatiMpavaa goppa rakShNa?

3. paadhamulaku suvaarthanae cheppulosagenu
hrudhayamMdhu shaaMthi aanMdhamosagenu
shoaDhanaa baaDhalennoa neeku vunnanoo
naaThuni suvaarthanu boaDhaparachavaa?

4. thappipoayinatti ninnu kanikariMchenu
goppaviMdhu chaesi uMgaramunu pettenu
thappulanni manniMchenu goppa dhaevudu
thappaka kShmiyiMchavaa nee viroaDhulan?

5. paraloakapu bahumaanamu neevu poMdhanu
parishudhDhula sahavaasM neeku shraeShTamu
paraloakapu pMdhemMdhu aMthamu varaku
parugeththavaa jeevakireetMbu poMdhanu?



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com