• waytochurch.com logo
Song # 3829

evaru jayimchedharoa vaarae samasthamunu pomdhedharuఎవరు జయించెదరో వారే సమస్తమును పొందెదరు



Reference: జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన 21:7

పల్లవి: ఎవరు జయించెదరో
వారే సమస్తమును పొందెదరు

1. ఎవరు కష్ట బాధ లోర్చెదరో
పట్టువదలక ప్రభుతో నుండు వారే
దిట్టముగా నత్యధిక విజయమును పొంది
గట్టిగా నిలిచెదరు వారెల్లరు ప్రభులో

2. ఎవరు శోధనలను జయింతురో
జీవమకుటము వారే పొందెదరు
పావనుడైన పరమ క్రీస్తేసు తోడ
పరిపాలింతురు ప్రభుని దివ్య రాజ్యములో

3. ఎవరు లోకాశలను జయింతురో
వారే సైతానును ఓడింతురు
పరిపూర్ణముగా ప్రభుని బలము గలవారై
పరలోక స్వాస్థ్యమును పొందెదరు

4. ఎవరు క్రీస్తేసు సంబంధులో
వారే పాప మరణము జయింతురు
ఓ మరణమా నీ ముల్లెక్కడ యనుచు
వీక్షింతురు పరమ విభుని రాకడ కొరకై

5. ఎవరు ప్రభు సేవను చేసెదరో
వారే పొందెదరు బహుమానము
ఓరిమి కలిగి పరుగును ముగించి
మురిసెదరు హల్లెలూయ పాటలతో



Reference: jayiMchuvaadu veetini svathMthriMchukonunu prakatana 21:7

Chorus: evaru jayiMchedharoa
vaarae samasthamunu poMdhedharu

1. evaru kaShta baaDha loarchedharoa
pattuvadhalaka prabhuthoa nuMdu vaarae
dhittamugaa nathyaDhika vijayamunu poMdhi
gattigaa nilichedharu vaarellaru prabhuloa

2. evaru shoaDhanalanu jayiMthuroa
jeevamakutamu vaarae poMdhedharu
paavanudaina parama kreesthaesu thoad
paripaaliMthuru prabhuni dhivya raajyamuloa

3. evaru loakaashalanu jayiMthuroa
vaarae saithaanunu oadiMthuru
paripoorNamugaa prabhuni balamu galavaarai
paraloaka svaasThyamunu poMdhedharu

4. evaru kreesthaesu sMbMDhuloa
vaarae paapa maraNamu jayiMthuru
oa maraNamaa nee mullekkada yanuchu
veekShiMthuru parama vibhuni raakada korakai

5. evaru prabhu saevanu chaesedharoa
vaarae poMdhedharu bahumaanamu
oarimi kaligi parugunu mugiMchi
murisedharu hallelooya paatalathoa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com