• waytochurch.com logo
Song # 3832

prabhuvuku thaginattu pruthiviloa priyudaa padhilamugaa jeevimchavaaప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా



Reference: ప్రభువునకు తగినట్టుగా నడువుము కొలొస్స Colossians 1:12

పల్లవి: ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా
పదిలముగా జీవించవా?

1. ఆదామవ్వలవలె నీవు సహ
కేవలము దిగంబరివైయుండ
ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో
పావన వస్త్రముల నిచ్చెను

2. శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు
సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె
అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా
హతసాక్షిగా నీ వుండెదవా?

3. ప్రభు యడుగుజాడలను పరికించి
ప్రభు కనుకూలంబుగా నడచినచో
హానోకువలె ఆ రెండవ మరణము
నొందక ప్రభుతో నుండెదవు

4. పరిశుద్ధమైన ప్రవర్తనలో
ప్రభు సర్వాంగ కవచముల్ కల్గి
నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి
ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్

5. మృతులను సహలేపు మహాత్మ్యుడని
తన సుతునర్పించె నబ్రాహాము
మృతికి లోనగు నీ శరీరంబును
అతనికె బలిగా నర్పించు

6. తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు
మౌనమున్ జూపి మరణము గోరె
కడు శ్రమకాలములో ఖండించె ఖడ్గము
ముంగిట నీవట్లుండెదవా?

7. యెహోవా భయము నొంది యోసేపు
ఎంత వైభవ మనుభవించెనో గాంచు
నీ జీవితంబులో దైవ భయము నొంది
అక్షయ కిరీటమున్ బొందు



Reference: prabhuvunaku thaginattugaa naduvumu kolossa Colossians 1:12

Chorus: prabhuvuku thaginattu pruThiviloa priyudaa
padhilamugaa jeeviMchavaa?

1. aadhaamavvalavale neevu sah
kaevalamu dhigMbarivaiyuMd
aa dhaevagorrepilla chaavoMdhi siluvaloa
paavana vasthramula nichchenu

2. shraeShTabali nichchi haebelu
sruShtikartha yokka saakShyamu poMdhe
atti saakShyamu poMdhanu avaniloa priyudaa
hathasaakShigaa nee vuMdedhavaa?

3. prabhu yadugujaadalanu parikiMchi
prabhu kanukoolMbugaa nadachinachoa
haanoakuvale aa reMdava maraNamu
noMdhaka prabhuthoa nuMdedhavu

4. parishudhDhamaina pravarthanaloa
prabhu sarvaaMga kavachamul kalgi
neethin prakatiMchina noavahun boali
khyaathi suvaarthan chaatu milan

5. mruthulanu sahalaepu mahaathmyudani
thana suthunarpiMche nabraahaamu
mruthiki loanagu nee shareerMbunu
athanike baligaa narpiMchu

6. thana thMdri khadgamunaku issaaku
maunamun joopi maraNamu goare
kadu shramakaalamuloa khMdiMche khadgamu
muMgita neevatluMdedhavaa?

7. yehoavaa bhayamu noMdhi yoasaepu
eMtha vaibhava manubhaviMchenoa gaaMchu
nee jeevithMbuloa dhaiva bhayamu noMdhi
akShya kireetamun boMdhu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com