visvasa veerulam విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం దేవునికే మేం వారసులం
విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో ........... విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులంపరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం 1. అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను అబ్రహామును దేవుని నమ్మెను - దేవుడతని కది నీతిగా ఎంచెను ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే - కదిలెనుగా అబ్రహాము యెహోవ యీరే అని కొడుకును లేపునని - అర్పించి పొందెనబ్రహాము విశ్వాసులకు తండ్రయ్యాడు - దేవునికే స్నేహితుడై పేరొందాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం2. యోసేపుకు దేవుడు కల లిచ్చెను - ఫలించు కొమ్మగా అశీర్వదించెను యోసేపు దేవుని ప్రేమించెను - అన్ని వేళల ప్రభు వైపే చూచెను గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు ప్రభువే తోడుండా శోధన జయించి - అధిపతిగా ఎదిగినాడు బానిస కాస్త రాజైనాడు - ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం 3. దానియేలుకు దేవుడు వరమిచ్చెను - కలల భావము వివరింప నేర్పెను దానియేలు తన దేవుని ఎరిగెను - ప్రత్యేకముగా జీవించి చూపెను రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని - దేవుని మహిమను చూపాడు సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి - సింహాల నోళ్లను మూశాడు దానియేలు దేవుడే జీవము గల దేవుడని - రాజు చేత రాజ్యమంత చాటించాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం4. సౌలును పౌలుగా దేవుడు మార్చెను - దైవ వాక్యపు ప్రత్యక్షత నిచ్చెను పౌలు యేసుని అంతట ప్రకటించెను - భులోకమంతా సంచారము చేసెను క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి - దర్శనమును నెరవేర్చాడు జీవ వాక్యమును చేత పట్టుకొని - సిలువ సాక్షిగ నిలిచాడు తన పరుగును కదా ముట్టించి - విశ్వాసం కాపాడుకొని గెలిచాడు విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులంపరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో