• waytochurch.com logo
Song # 386

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ

yesayya lone unnadhi manaku rakshana

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే హే జీవము జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం - తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

1. వ్యసనపు ఉచ్చులో ఉన్న వారికి - యేసులో విడుదల - ఎ ఎ ఏ
శాపపు దారిలో నలిగిన వారికి - యేసే విమోచన - ల ల లా
మానవ నీతి వ్యర్థము - దేవుని నీతే జీవము (ఆ ఆ ఆ అ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

2. పాపపు జీతమై మరణ మొచ్చెను - మానవుని చంపెను - అయయో
యేసే మరణము గెలిచి లేచెను - మరణపు ముల్లు విరిచెను - న న నా
యేసుడు పొందిన దెబ్బలే - మనకు స్వస్థత నిచ్చెను (ఆ ఆ ఆ అ ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

3. జ్ఞానము కొదువగా ఉన్న వారికి -యేసే దైవ జ్ఞానము - ఆహా హ
దీర్ఘాయువు ధన ఘనతలే - జ్ఞానపు అనుచర గణము - ఒహో హొ
దేవుని ఆశీర్వాదమే - ఇచ్చును మహిమైశ్వర్యము (ఆ ఆ ఆ అ ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

4. అగ్ని గుండపు పాత్రులకు - ప్రభు కల్పించాడు రక్షణ - హలెలుయ
మరలా మన వారిని చూస్తాం మనము - ఉన్నది నిరీక్షణ -ఆ...మెన్
ప్రభువే మన సమాధానము - ఆహా ఆత్మలో ఆనందము (ఆ ఆ ఆ అ ) -2

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

5. బలహీనుడు జబ్బును గాక - బలవంతుడను నేను యేసయ్యలో
ధనహీనుడు పలుకును గాక - ధనవంతుడను నేను యేసయ్యలో
అంధుడు చెప్పును గాక - నే చూస్తున్నా యేసయ్యను
మృతుడు తెలుపును గాక - నే తిరిగి జన్మించాను
పాపివి నీవు కాదిక - నే పరిశుద్ధుడ నేసయ్యలో
దోషివి కాదు నీవిక - నే నీతి మంతుడను నా యేసులో

నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే హే జీవము - జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం - తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం -2
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com