• waytochurch.com logo
Song # 388

యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

yuddha veeruda

యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

వెట్టి చాకిరి పోయె వెనుకకు - విడుదలిచ్చెగా రక్తం మనలకు

లేదు మనకిక అపజయం - యేసు రక్తమే మన జయం

హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2

యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

1. ఏదేమైనా గాని ఎదురేమున్న గాని ముందుకే పయనము

ఎర్ర సంద్రమైనా ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము

యేసుడే సత్య దైవం అంటూ - సిలువను చాటుదాం

అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుదాం

లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం

హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

2. పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై - ప్రభువు తోడుండగా

చింతయే లేదు ఏ కొదువ లేదు - నిస్సత్తువే రాదుగా

ఆకలి తీర్చ మన్నా కురియును - యేసుని నీడలో

దాహము తీర్చ బండయె చీలును - కలువరి సిలువలో

లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం

హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2
యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు

వెట్టి చాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు

3. గొర్రెపిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మా కిచ్చెను బహుబలం

శక్తి చేత కాదు బలము చేత కాదు - ప్రభు ఆత్మతో గెలిచెదం

యేసుని గొప్ప వాగ్ధానములే - నింపెను నిబ్బరం

యేసుని యందు విశ్వాసమె మా విజయపు సూచకం

లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం

హల్లెలూయ హోసన్నా -3 మనదే విజయం -2

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com