• waytochurch.com logo
Song # 389

yesu dhevuni aaradhikulam యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం


యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2

మరణమైన శ్రమ ఎదురైనా -బెదిరిపోని విశ్వాసులం (మేం) -2

మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం -2

ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2

యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం



1. షద్రకు మేషకు అబెద్నగోలను -అగ్ని గుండంలో త్రోయబోగా -2

నెబుకద్నెజెరు మాకు చింతయే లేదులే -మా .. దేవుడు మమ్మును రక్షించులే -2

అని తెగించి విశ్వసించి - ముగ్గురు నలుగురై జయించిరే (వారు) -2



మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)

మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం

ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2

యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం



2. శత్రు సైన్యము దండెత్తి వచ్చెగా -యెహొషపాతు ప్రార్థన చేసెగా -2

యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా - భయమే లేక వారు జయ గీతం పాడెగా -2

ఆత్మతోన స్తుతియిస్తుండా -దేవుడే యుద్ధం జరిగించెగా (వారు) -2




మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)

మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం

ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2

యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం



3. శత్రు గొల్యాతు సవాలు విసెరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా -2

ఒక్క దావీదే రోషముతో లేచెగా - జీవము గల దేవుని నామాన్నీ చాటెగా -2

చిన్న రాయి వడెసెతోన - ఆత్మ శక్తితో జయించెగా (హే) -2

మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు) -2

మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం

ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2

యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com