yesu dhevuni aaradhikulam యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2మరణమైన శ్రమ ఎదురైనా -బెదిరిపోని విశ్వాసులం (మేం) -2మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం -2 ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం1. షద్రకు మేషకు అబెద్నగోలను -అగ్ని గుండంలో త్రోయబోగా -2 నెబుకద్నెజెరు మాకు చింతయే లేదులే -మా .. దేవుడు మమ్మును రక్షించులే -2 అని తెగించి విశ్వసించి - ముగ్గురు నలుగురై జయించిరే (వారు) -2 మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు) మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2 యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం2. శత్రు సైన్యము దండెత్తి వచ్చెగా -యెహొషపాతు ప్రార్థన చేసెగా -2 యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా - భయమే లేక వారు జయ గీతం పాడెగా -2 ఆత్మతోన స్తుతియిస్తుండా -దేవుడే యుద్ధం జరిగించెగా (వారు) -2 మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు) మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2 యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం3. శత్రు గొల్యాతు సవాలు విసెరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా -2 ఒక్క దావీదే రోషముతో లేచెగా - జీవము గల దేవుని నామాన్నీ చాటెగా -2 చిన్న రాయి వడెసెతోన - ఆత్మ శక్తితో జయించెగా (హే) -2 మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు) -2 మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెల్చిన -యేసు రాజే మా విజయం (తన) -2 యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం -2