• waytochurch.com logo
Song # 3897

nae paadedha nithyamu paadedha prabhuvaa neeku sthuthi paadedhanనే పాడెద నిత్యము పాడెద ప్రభువా నీకు స్తుతి పాడెదన్



Reference: అతడు యధార్థ హృదయుడై ... నేర్పరియై వారిని నడిపించెను కీర్తన Psalm 78:72

పల్లవి: నే పాడెద నిత్యము పాడెద - ప్రభువా నీకు స్తుతి పాడెదన్

1. మంచి కాపరి నీవైతివి గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి
పాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నా కొసగితివి
హర్షించి ప్రభు పాడెదను

2. గొప్ప కాపరివి తోడై యున్నావు ప్రతి అవసరతల్ తీర్చుచున్నావు
నా ప్రాణమునకు సేదనుదీర్చి మరణలోయలలో తోడై యుందువు
యాత్రలో పాడుచు వెళ్ళెదను

3. ఆత్మల కాపరి సత్యవంతుడవు గొర్రెలన్నిటికి కాపరి నీవై
ద్వేషించెదవు దొంగకాపరులన్ నీగొర్రెలు నీస్వరమును వినును
హృదయపూర్తిగ పాడెదను

4. ప్రధానకాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు
మహిమకిరీటము నాకొసగెదవు పరమనగరమందు నన్నుంచెదవు
ఎలుగెత్తి ప్రభు పాడెదను



Reference: athadu yaDhaarTha hrudhayudai ... naerpariyai vaarini nadipiMchenu keerthana Psalm 78:72

Chorus: nae paadedha nithyamu paadedha - prabhuvaa neeku sthuthi paadedhan

1. mMchi kaapari neevaithivi gorrelakoraku praaNamichchithivi
paapapu paathranu neevae thraagithivi rakShNa paathranu naa kosagithivi
harShiMchi prabhu paadedhanu

2. goppa kaaparivi thoadai yunnaavu prathi avasarathal theerchuchunnaavu
naa praaNamunaku saedhanudheerchi maraNaloayalaloa thoadai yuMdhuvu
yaathraloa paaduchu veLLedhanu

3. aathmala kaapari sathyavMthudavu gorrelannitiki kaapari neevai
dhvaeShiMchedhavu dhoMgakaaparulan neegorrelu neesvaramunu vinunu
hrudhayapoorthiga paadedhanu

4. praDhaanakaapari praemamayudavu thvaragaa neevu prathyakShmaudhuvu
mahimakireetamu naakosagedhavu paramanagaramMdhu nannuMchedhavu
elugeththi prabhu paadedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com