• waytochurch.com logo
Song # 3904

jayasheeludavagu oa maa prabhuvaa jayageethamul paadedhmజయశీలుడవగు ఓ మా ప్రభువా జయగీతముల్ పాడెదం



Reference: మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము 2 కొరింథీ Corinthians 2:14

పల్లవి: జయశీలుడవగు ఓ మా ప్రభువా
జయగీతముల్ పాడెదం

1. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి
కృతజ్ఞతచే హృదయము నిండె స్తుయింతుమో మా ప్రభు

2. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను
ఉదయించెమాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము

3. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యంబును
నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడ నొసగితివి

4. శత్రుని వురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి
భయభీతిలోన అభయంబు నిచ్చి విడిపించితివి మా ప్రభో

5. యుద్దంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను
అని ప్రభూ నీవు పోరాడితివి మా పక్షమందు నీవే

6. క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మము
ఊరేగించుచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు

7. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు కొంటివి నీవు
విడువబడిన మమ్ము వివాహితగా జేసె హల్లెలూయా పాడెదము



Reference: maa dhvaaraa prathi sThalamMdhunu kreesthunu goorchina jnYaanamu yokka suvaasananu kanuparachuchu aayana yMdhu mammunu ellappudu vijayoathsavamuthoa ooraegiMchuchunna dhaevuniki sthoathramu 2 koriMThee Corinthians 2:14

Chorus: jayasheeludavagu oa maa prabhuvaa
jayageethamul paadedhM

1. paapMbu chaetha padichedina mammu karuNiMchi rakShiMchithivi
kruthajnYthachae hrudhayamu niMde sthuyiMthumoa maa prabhu

2. neethiyaelaeni maa neecha brathukul nee yMdhu sThiramaayenu
udhayiMchemaapai neethi sooryuMdu mudhamaara praNuthiMthumu

3. aviDhaeyathathoa avivaekulamai koalpoathimi bhaagyMbunu
nee jnYaana ghanatha aishvaryamulanu dhayathoada nosagithivi

4. shathruni vuriloa chikkina maathoa naa soththu meerMtivi
bhayabheethiloana abhayMbu nichchi vidipiMchithivi maa prabhoa

5. yudhdhMbu naadhi niluchuMdi choodudi naenichchu rakShNanu
ani prabhoo neevu poaraadithivi maa pakShmMdhu neevae

6. kreesthaesu prabhuloa prathisThalamMdhu vijayoathsaahamuthoa mamu
ooraegiMchuchu mahima noMdhuchunna dhaevaa sthoathramulu

7. paripoorNa krupathoa nee vishvaasyathanu kanuparachu koMtivi neevu
viduvabadina mammu vivaahithagaa jaese hallelooyaa paadedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com