prabhuni gruhamu aayana mahimathoa paripoornamugaa nimdenuప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను
Reference: యెహోవా తేజస్సుతో మందిరము నిండెను. 2 దినవృత్తా Chronicles 7:2పల్లవి: ప్రభుని గృహము ఆయన మహిమతో - పరిపూర్ణముగా నిండెను1. అపరాధములచే ప్రజలందరును - దేవుని మహిమను కోల్పోయిరితన మహిమను మన కిచ్చుటకు - యేసు ప్రభువే బలి యాయెన్2. కృపా సత్యములు సంపూర్ణముగా - మన మధ్యలో వసించెనుతండ్రి మహిమను తన సుతునిలో - మన మందరము చూచితిమి3. ప్రభువు యింటిని నిర్మించు చుండె - సజీవమైన రాళ్ళతోఆయన మహిమ దానియందుండ - తన సంకల్పమై యున్నది4. శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు - మానవ హస్తము అందుండదుక్రయమునిచ్చి స్థలముకొనెను - తాను కోరిన స్థలమదే5. ప్రత్యేక పరచిన ఆత్మీయ యింటికి తన పునాదిని వేసెనురక్షణ జీవిత సాక్ష్యము ద్వారా - ప్రభువే సర్వము చేసెను6. సింహాసనముపై కూర్చున్న ప్రభువే - అణగ ద్రొక్కెను శత్రువునుసంపూర్ణ జయముతో ఆర్భాటముతో - వెలిగించెను తన యింటిని7. దేవుని యిల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగివచ్చున్దహించ బడును సర్వమలినము - ఇంటిని మహిమతో నింపును
Reference: yehoavaa thaejassuthoa mMdhiramu niMdenu. 2 dhinavruththaa Chronicles 7:2Chorus: prabhuni gruhamu aayana mahimathoa - paripoorNamugaa niMdenu1. aparaaDhamulachae prajalMdharunu - dhaevuni mahimanu koalpoayirithana mahimanu mana kichchutaku - yaesu prabhuvae bali yaayen2. krupaa sathyamulu sMpoorNamugaa - mana maDhyaloa vasiMchenuthMdri mahimanu thana suthuniloa - mana mMdharamu choochithimi3. prabhuvu yiMtini nirmiMchu chuMde - sajeevamaina raaLLathoaaayana mahima dhaaniyMdhuMda - thana sMkalpamai yunnadhi4. shaaMthiraaju yillu kattuchunnaadu - maanava hasthamu aMdhuMdadhukrayamunichchi sThalamukonenu - thaanu koarina sThalamadhae5. prathyaeka parachina aathmeeya yiMtiki thana punaadhini vaesenurakShNa jeevitha saakShyamu dhvaaraa - prabhuvae sarvamu chaesenu6. siMhaasanamupai koorchunna prabhuvae - aNaga dhrokkenu shathruvunusMpoorNa jayamuthoa aarbhaatamuthoa - veligiMchenu thana yiMtini7. dhaevuni yillu mugiMchabadagaa painuMdi agni dhigivachchundhahiMcha badunu sarvamalinamu - iMtini mahimathoa niMpunu