• waytochurch.com logo
Song # 3918

ee loaka yaathraloa nae saaguchumda okasaari navvu okasaari yaedpuఈ లోక యాత్రలో నే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు



Reference: గురియొద్దకే పరుగెత్తుచున్నాను. ఫిలిప్పీ Philippians 3:14

పల్లవి: ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2)
అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2)

1. జీవిత యాత్ర యెంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫాను లున్నవి (2)
అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2)
కాయువారెవరు రక్షించేదెవరు (2)

2. హృదయము శుద్ధి పరచుకొన్నాను
నా చేతులెంతో పరిశుద్ధ పరచ
అనుకొనని రీతి అపవాదివచ్చి
నా జీవితమును నిరాశపరచె

3. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా
అనుదినము నన్ను ఆదరించెదవు
నీతో వున్నాను విడువలేదనెడు
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను

4. ఈ అనుభవముతో నేనడచు కొందు
ప్రియ యేసు వైపు నేను చూచుచు
గతమునంత నేను మరచిపోయెదను
కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు

5. తోడైయుండెదవు అంతము వరకు
నీవు విడువవు అందరు విడచినను
నూతన బలమును నా కొసగెదవు
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే



Reference: guriyodhdhakae parugeththuchunnaanu. philippee Philippians 3:14

Chorus: ee loaka yaathraloa nae saaguchuMda (2)
okasaari navvu okasaari yaedpu (2)
ayinanu kreesthaesu naathoada nuMdu (2)

1. jeevitha yaathra yeMthoa kaTinamu (2)
ghoaraaMDhakaara thuphaanu lunnavi (2)
abhyMtharamulu yennennoa vuMdu (2)
kaayuvaarevaru rakShiMchaedhevaru (2)

2. hrudhayamu shudhDhi parachukonnaanu
naa chaethuleMthoa parishudhDha parach
anukonani reethi apavaadhivachchi
naa jeevithamunu niraashaparache

3. neevae aashrayM kreesthaesu prabhuvaa
anudhinamu nannu aadhariMchedhavu
neethoa vunnaanu viduvalaedhanedu
nee praema maDhura svaramu vinnaanu

4. ee anubhavamuthoa naenadachu koMdhu
priya yaesu vaipu naenu choochuchu
gathamunMtha naenu marachipoayedhanu
kanneeru thuduchu naa priya prabhuvu

5. thoadaiyuMdedhavu aMthamu varaku
neevu viduvavu aMdharu vidachinanu
noothana balamunu naa kosagedhavu
nae sThiramuga nuMda nee koarika yidhiyae



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com