• waytochurch.com logo
Song # 3923

prabhuvaa chaesithivi vaagdhaanamulu maathoa neravaerchithiviప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి



Reference: నీవు గర్భము నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని... జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని యిర్మియా Jeremiah 1:5

పల్లవి: ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి
బహు నేర్పుతోడన్ సన్నుతించెదనో ప్రభువా

1. వెదకితివి నన్ను నీ వాక్యముచే
తగిన కాలమున నిన్ను చేరన్ తరుణమిచ్చితివి
సొత్తని నన్ను నీ పుత్రునిజేయ కడిగితివి నీ రక్తముతో

2. బాలుడను భావన వలదంటివి
బహుజనంబులకు ప్రవక్తగా నియమించితివి
గర్భమునందే రూపించిన ప్రభూ పేదనైన నేను పూజింతున్

3. భయభీతిలో నాకు అభయము నిచ్చి
విజృంభించిన విరోధిపై విజయము నిచ్చి
కట్టను నాటను నా నోటను నీమాట నుంచిన ప్రభూ కీర్తింతున్

4. మందిర మహిమను హెచ్చులోనుంచ
సైన్యాధిపతి నీదు సమాధానము నిచ్చి
ఈ స్థలమును నీదు శాంతితో నింపిన షాలేమురాజా స్తోత్రింతున్

5. మోషేకు నీవు మాటిచ్చినట్లు
అడుగుడి ప్రతి స్థలము లన్నిటిని మాకిచ్చుటకు
పరిశుద్ధాత్మతో నింపిన ప్రభువా పలుమాటలతో ప్రణుతింతున్

6. ఇహపరమందున సర్వాధికారివై శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చిన
ఆత్మదేవా యుగాంతమున నీ సన్నిధి మాతో
నున్నందులకై స్తుతియింతున్

7. వర్థిల్లదంటివి ఏ ఆయుధమున్ నీకు విరోధంబుగా రూపించినచో
న్యాయ విమర్శలో తరుణమిచ్చితివి
నేర స్థాపన చేయన్ హల్లెలూయా



Reference: neevu garbhamu nuMdi bayata padaka munupae naenu ninnu prathiShTiMchithini... janamulaku pravakthagaa ninnu niyamiMchithini yirmiyaa Jeremiah 1:5

Chorus: prabhuvaa chaesithivi vaagdhaanamulu maathoa neravaerchithivi
bahu naerputhoadan sannuthiMchedhanoa prabhuvaa

1. vedhakithivi nannu nee vaakyamuchae
thagina kaalamuna ninnu chaeran tharuNamichchithivi
soththani nannu nee puthrunijaeya kadigithivi nee rakthamuthoa

2. baaludanu bhaavana valadhMtivi
bahujanMbulaku pravakthagaa niyamiMchithivi
garbhamunMdhae roopiMchina prabhoo paedhanaina naenu poojiMthun

3. bhayabheethiloa naaku abhayamu nichchi
vijruMbhiMchina viroaDhipai vijayamu nichchi
kattanu naatanu naa noatanu neemaata nuMchina prabhoo keerthiMthun

4. mMdhira mahimanu hechchuloanuMch
sainyaaDhipathi needhu samaaDhaanamu nichchi
ee sThalamunu needhu shaaMthithoa niMpina Shaalaemuraajaa sthoathriMthun

5. moaShaeku neevu maatichchinatlu
adugudi prathi sThalamu lannitini maakichchutaku
parishudhDhaathmathoa niMpina prabhuvaa palumaatalathoa praNuthiMthun

6. ihaparamMdhuna sarvaaDhikaarivai shiShyulaku nee aajnYnichchin
aathmadhaevaa yugaaMthamuna nee sanniDhi maathoa
nunnMdhulakai sthuthiyiMthun

7. varThilladhMtivi ae aayuDhamun neeku viroaDhMbugaa roopiMchinachoa
nyaaya vimarshaloa tharuNamichchithivi
naera sThaapana chaeyan hallelooyaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com