• waytochurch.com logo
Song # 3925

laelemmu seeyoanu dhariyimchumu nee balamuలేలెమ్ము సీయోను ధరియించుము నీ బలము



Reference: సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. యెషయా Isaiah 52:1

Reference: నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా Isaiah 60:1

Reference: మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను. యెహెజ్కేలు Ezekiel 36:11

పల్లవి: లేలెమ్ము సీయోను - ధరియించుము నీ బలము
సుందర వస్త్రముల ధరించు - పరిశుద్ధ పట్టణమా

1. నిష్కళంక యెరూషలేమా - ఇంకెన్నటికి నీ మధ్యకు
సున్నతి పొందని అపవిత్రులును - లోనికి రారెన్నడు

2. లెమ్ము నీవు తేజరిల్లుము - వెలుగు నీకు వచ్చియున్నది
యెహోవా మహిమ నీ మీద - ఉదయించెను లేలెమ్ము

3. మనుష్యులను పశువులను - విస్తరింప జేసెదను
అభివృద్ధి నొందును అపూర్వముగ - పూర్వస్థానములో నిన్నుంతున్

4. మునుపటికంటె అధికమైన - మేలు నీకు కలుగజేతును
అపుడు నీవు యెహోవా నేనని - వివరముగా నెరిగెదవు

5. అందుచేతనే చెప్పుచున్నాడు - నిద్రించే నీవు మేలుకొనుము
మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు



Reference: seeyoanoo, lemmu lemmu, nee balamu DhariMchukonumu. parishudhDha pattaNamaina yerooShlaemaa, nee suMdhara vasthramulanu DhariMchukonumu. yeShyaa Isaiah 52:1

Reference: neeku velugu vachchiyunnadhi, lemmu, thaejarillumu. yehoavaa mahima nee meedha udhayiMchenu. yeShyaa Isaiah 60:1

Reference: munupatikMte aDhikamaina maelu meeku kalugajaesedhanu. yehejkaelu Ezekiel 36:11

Chorus: laelemmu seeyoanu - DhariyiMchumu nee balamu
suMdhara vasthramula DhariMchu - parishudhDha pattaNamaa

1. niShkaLMka yerooShlaemaa - iMkennatiki nee maDhyaku
sunnathi poMdhani apavithrulunu - loaniki raarennadu

2. lemmu neevu thaejarillumu - velugu neeku vachchiyunnadhi
yehoavaa mahima nee meedha - udhayiMchenu laelemmu

3. manuShyulanu pashuvulanu - visthariMpa jaesedhanu
abhivrudhDhi noMdhunu apoorvamuga - poorvasThaanamuloa ninnuMthun

4. munupatikMte aDhikamaina - maelu neeku kalugajaethunu
apudu neevu yehoavaa naenani - vivaramugaa nerigedhavu

5. aMdhuchaethanae cheppuchunnaadu - nidhriMchae neevu maelukonumu
mruthulaloa nuMdi laechirammu prakaashiMchunu kreesthu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com