• waytochurch.com logo
Song # 3931

yehoavaa kaaryamulannitikai arpimthu kruthajnythaluయెహోవా కార్యములన్నిటికై అర్పింతు కృతజ్ఞతలు



Reference: చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను.... వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక కీర్తన 107:7,8

పల్లవి: యెహోవా కార్యములన్నిటికై - అర్పింతు కృతజ్ఞతలు
ఆశించెడి వారి ప్రాణములెల్లను - సంతృప్తి పరచెదవు

1. వెదకిన నా మది కొసగెను రక్షణ
దర్శనమిచ్చి దరి జేర్చితివి
నీ రాజ్యమును నీ నీతియును
వెదకుమని నన్ను ప్రేమతో పిలిచితివి

2. కనిపించెడి ఆ కానానును జూడ
ధన్యతలకది ధననిధిగ్ నుండె
దానిపై నుండు నీకను దృష్టి
దివా రాత్రులు ప్రియమది నీకెంతో

3. నూతన మాయెను భూమ్యాకాశముల్
పాపముల్ పడిన సముద్రములేదట
పరిశుద్ధంబైన యెరూషలేమది
దేవుని మహిమతో దిగివచ్చుచుండె

4. కళంకము లేక అలంకరించిన
పెండ్లి కుమార్తెయై ప్రియునిజూచు
సంఘము యిదియే ప్రియుడా కనుమా
కానవు నెచ్చటన్ ఈ వజ్రకాంతుల్

5. శిల్పియై యెహోవా నిర్మించుచున్న
పండ్రెండు పునాదుల ఆ పట్టణముకై
నబ్రహాము ఎదురు చూచెనుగా
పరికించుము నీవు నీ కన్నుల నెత్తి

6. కుక్కలు మాంత్రికులు వ్యభిచారులును
నరహంతకులును విగ్రహారాధికులు
అబద్దమును ప్రేమించి జరిగించు
ప్రతివాడునట వెలుపట నుందురుగా

7. కృప కాలంబిది ఓ నా ప్రియుడా
నిర్మల వాక్యమన్ పాలను పొంది
శిశువును బోలి ఎరుగుము నీవు
పదములు నేర్తువు అపవాది నెదిరింపన్



Reference: chakkani throavanu aayana vaarini nadipiMchenu.... vaaru yehoavaaku kruthajnYthaasthuthulu chelliMchudhuru gaaka keerthana 107:7,8

Chorus: yehoavaa kaaryamulannitikai - arpiMthu kruthajnYthalu
aashiMchedi vaari praaNamulellanu - sMthrupthi parachedhavu

1. vedhakina naa madhi kosagenu rakShN
dharshanamichchi dhari jaerchithivi
nee raajyamunu nee neethiyunu
vedhakumani nannu praemathoa pilichithivi

2. kanipiMchedi aa kaanaanunu jood
Dhanyathalakadhi DhananiDhig nuMde
dhaanipai nuMdu neekanu dhruShti
dhivaa raathrulu priyamadhi neekeMthoa

3. noothana maayenu bhoomyaakaashamul
paapamul padina samudhramulaedhat
parishudhDhMbaina yerooShlaemadhi
dhaevuni mahimathoa dhigivachchuchuMde

4. kaLMkamu laeka alMkariMchin
peMdli kumaartheyai priyunijoochu
sMghamu yidhiyae priyudaa kanumaa
kaanavu nechchatan ee vajrakaaMthul

5. shilpiyai yehoavaa nirmiMchuchunn
pMdreMdu punaadhula aa pattaNamukai
nabrahaamu edhuru choochenugaa
parikiMchumu neevu nee kannula neththi

6. kukkalu maaMthrikulu vyabhichaarulunu
narahMthakulunu vigrahaaraaDhikulu
abadhdhamunu praemiMchi jarigiMchu
prathivaadunata velupata nuMdhurugaa

7. krupa kaalMbidhi oa naa priyudaa
nirmala vaakyaman paalanu poMdhi
shishuvunu boali erugumu neevu
padhamulu naerthuvu apavaadhi nedhiriMpan



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com