• waytochurch.com logo
Song # 394

krupa krupa naa yesu krupa కృప కృప నా యేసు కృప కృప కృప కృప


కృప కృప నా యేసు కృప -కృప కృప కృప

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప

నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే హే ఓ ఓ

నివు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే హే ..

నేనేమై యుంటినో అందుకు కాదయ్యా అహా

నా క్రియలను బట్టి అసలే కాదయ్యా

చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా


జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా


కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా


1. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా - కలలోనైనా నిన్ను మరువనేలేనయ్యా

రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా - నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా

నీ ప్రేమ ధ్వజమే అయితే నేనాపై నన్నాకర్షించావయ్య - నువ్వు లేని నన్ను ఊహించలేను నా శిరస్సు నీవయ్యా


నా గుర్తిపంత నీవే యేసయ్య - నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా

నేనేమై యుంటినో అందుకు కాదయ్యా అహా

నా క్రియలను బట్టి అసలే కాదయ్యా

చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా


కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ


కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా


2. నా పాపం నను తరుమంగ నీలో దాచితివే - నేన్ నీకు శిక్ష విధించను షాలోం అంటివే

నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే - ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే

నీ మంచితనమే కలిగించె నాలో మారుమనసేసయ్యా - నేనెంతగానో క్షమియించబడితిని ఎక్కువగా ప్రేమించెదనయ్యా

నా మొదటి ప్రేమ నీదే యేసయ్యా - నా మొదటి స్థానం నీకే యేసయ్యా....

నేనేమై యుంటినో అందుకు కాదయ్యా అహా

నా క్రియలను బట్టి అసలే కాదయ్యా

చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా


3. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా - నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా

నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా - నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా

ఏముంది నాలో నీవింతగా నను హెచ్చించుటకు యేసయ్యా - ఏమివ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనసేనయ్యా

నీ కొరకే నేను జీవిస్తానయ్యా - మన ప్రేమను కథగా వివరిస్తానయ్య

నేనేమై యుంటినో అందుకు కాదయ్యా అహా

నా క్రియలను బట్టి అసలే కాదయ్యా

చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా



4. పదివేలమందిలో నీవు అతిసుందరుడవయా - అతికాంక్షనీయుడవు నా ప్రియుడవునీవయ్యా

నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా - విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా

నీలోన నేను నాలోన నీవు ఏకాత్మ ఐతిమయా - జీవించువాడను ఇక నేను నాలో నా యందు నీవయ్యా

నీ మనసే నా దర్శనమేసయ్యా - నీ మాటేనా మనుగడ యేసయ్యా


నేనేమై యుంటినో అందుకు కాదయ్యా అహా

నా క్రియలను బట్టి అసలే కాదయ్యా

చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా

జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా

నా తల్లి గర్భము నందే ప్రతిష్టించావయ్యా హా

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప ఆ

కృప కృప నా యేసు కృప -కృప కృప కృప హా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com