• waytochurch.com logo
Song # 3943

yehoavaanu sthuthimchudi meeru yehoavaa naamamunu sthuthiyimchudiయెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతియించుడి



Reference: యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు. 2 దినవృత్తాంతములు Chronicles 6:14-15

Reference: సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ― సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి. జెకర్యా Zechariah 8:9

పల్లవి: యెహోవాను స్తుతించుడి - మీరు - యెహోవా నామమును స్తుతియించుడి

అను పల్లవి: యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి

1. యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్
నేటి దినమున వినెడి మీరు - ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు

2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువని
నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు - భూమ్యాకాశములందున లేడని

3. ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు
సొలొమోను నందా వాగ్దానములను - కన్నుల విందుగ నెరవేర్చెనుగా

4. పోవుడి, పోవుడి - తొలగిపోవుడి - అపవిత్రమైన దేని ముట్టకుడి
యెహోవా సేవోప కరణములను - మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి

5. ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గాన
ఉన్నతమైన స్థానమందుండి - ఘనుడైనవాడై హెచ్చింపబడును

6. పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారై
సీయోను! నీ దేవుడేలు చున్నాడని - స మాధానమును ప్రకటించు పాదములు

7. ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొర్రెపిల్ల సింహాసనముండు
సేవింతురు తన దాసులాయనను - రవి తేజులై దివి రాజ్యమునందు



Reference: yehoavaa ishraayaeleeyula dhaevaa, hrudhayapoorvakamugaa ninnu anusariMchu nee bhakthulaku nibMDhananu neravaerchuchu krupanu choopuchu nuMdu neevMti dhaevudu aakaashamMdhainanu bhoomi yMdhainanu laedu. nee saevakudaina dhaaveedhu anu naa thMdrithoa neevu selavichchinamaata neravaerchiyunnaavu; neevu vaagdhaanamuchaesi yee dhinamuna kanabaduchunnattugaa dhaanini neravaerchiyunnaavu. 2 dhinavruththaaMthamulu Chronicles 6:14-15

Reference: sainyamulaku aDhipathiyagu yehoavaa selavichchunadhaemanagaa ― sainyamulaku aDhipathiyagu yehoavaa mMdhiramunu kattutakai dhaani punaadhivaesina dhinamuna pravakthala noata palukabadina maatalu ee kaalamuna vinuvaaralaaraa, Dhairyamu thechchukonudi. jekaryaa Zechariah 8:9

Chorus: yehoavaanu sthuthiMchudi - meeru - yehoavaa naamamunu sthuthiyiMchudi

Chorus-2: yehoavaa saevakulaaraa - meeru sthuthiMchudi

1. yehoavaa mMdhira punaadhini vaesina - dhinamuna palikina pravakthala maatan
naeti dhinamuna vinedi meeru - Dhairyamu thechchukonudane prabhuvu

2. poorNa manassuthoa saeviMchu bhakthula - karuNathoa thana krupa jooputa maruvani
nibMDhana neravaerchu neevMti dhaevudu - bhoomyaakaashamulMdhuna laedani

3. ila dhaaveedhanu pitharuni thoada - selavichchina maata neravaerchenu prabhu
solomoanu nMdhaa vaagdhaanamulanu - kannula viMdhuga neravaerchenugaa

4. poavudi, poavudi - tholagipoavudi - apavithramaina dhaeni muttakudi
yehoavaa saevoapa karaNamulanu - moayu vaaralagu meeru shudhDhi chaesikonudi

5. aalakiMchudi meeru thana saevakudu - vivaekamugaa pravarthiMchunu gaan
unnathamaina sThaanamMdhuMdi - ghanudainavaadai hechchiMpabadunu

6. parvathamulapai eMthoa suMdharamulu - raajya suvaarthanu chaatiMchuvaarai
seeyoanu! nee dhaevudaelu chunnaadani - sa maaDhaanamunu prakatiMchu paadhamulu

7. aa nagaramuloa nuMdadhu shaapamu - dhaevuni gorrepilla siMhaasanamuMdu
saeviMthuru thana dhaasulaayananu - ravi thaejulai dhivi raajyamunMdhu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com