yehoavaanu sthuthimchudi meeru yehoavaa naamamunu sthuthiyimchudiయెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతియించుడి
Reference: యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు. 2 దినవృత్తాంతములు Chronicles 6:14-15Reference: సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ― సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి. జెకర్యా Zechariah 8:9పల్లవి: యెహోవాను స్తుతించుడి - మీరు - యెహోవా నామమును స్తుతియించుడిఅను పల్లవి: యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి1. యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్నేటి దినమున వినెడి మీరు - ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువనినిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు - భూమ్యాకాశములందున లేడని3. ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభుసొలొమోను నందా వాగ్దానములను - కన్నుల విందుగ నెరవేర్చెనుగా4. పోవుడి, పోవుడి - తొలగిపోవుడి - అపవిత్రమైన దేని ముట్టకుడియెహోవా సేవోప కరణములను - మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి5. ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గానఉన్నతమైన స్థానమందుండి - ఘనుడైనవాడై హెచ్చింపబడును6. పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారైసీయోను! నీ దేవుడేలు చున్నాడని - స మాధానమును ప్రకటించు పాదములు7. ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొర్రెపిల్ల సింహాసనముండుసేవింతురు తన దాసులాయనను - రవి తేజులై దివి రాజ్యమునందు
Reference: yehoavaa ishraayaeleeyula dhaevaa, hrudhayapoorvakamugaa ninnu anusariMchu nee bhakthulaku nibMDhananu neravaerchuchu krupanu choopuchu nuMdu neevMti dhaevudu aakaashamMdhainanu bhoomi yMdhainanu laedu. nee saevakudaina dhaaveedhu anu naa thMdrithoa neevu selavichchinamaata neravaerchiyunnaavu; neevu vaagdhaanamuchaesi yee dhinamuna kanabaduchunnattugaa dhaanini neravaerchiyunnaavu. 2 dhinavruththaaMthamulu Chronicles 6:14-15Reference: sainyamulaku aDhipathiyagu yehoavaa selavichchunadhaemanagaa ― sainyamulaku aDhipathiyagu yehoavaa mMdhiramunu kattutakai dhaani punaadhivaesina dhinamuna pravakthala noata palukabadina maatalu ee kaalamuna vinuvaaralaaraa, Dhairyamu thechchukonudi. jekaryaa Zechariah 8:9Chorus: yehoavaanu sthuthiMchudi - meeru - yehoavaa naamamunu sthuthiyiMchudiChorus-2: yehoavaa saevakulaaraa - meeru sthuthiMchudi1. yehoavaa mMdhira punaadhini vaesina - dhinamuna palikina pravakthala maatannaeti dhinamuna vinedi meeru - Dhairyamu thechchukonudane prabhuvu2. poorNa manassuthoa saeviMchu bhakthula - karuNathoa thana krupa jooputa maruvaninibMDhana neravaerchu neevMti dhaevudu - bhoomyaakaashamulMdhuna laedani3. ila dhaaveedhanu pitharuni thoada - selavichchina maata neravaerchenu prabhusolomoanu nMdhaa vaagdhaanamulanu - kannula viMdhuga neravaerchenugaa4. poavudi, poavudi - tholagipoavudi - apavithramaina dhaeni muttakudiyehoavaa saevoapa karaNamulanu - moayu vaaralagu meeru shudhDhi chaesikonudi5. aalakiMchudi meeru thana saevakudu - vivaekamugaa pravarthiMchunu gaanunnathamaina sThaanamMdhuMdi - ghanudainavaadai hechchiMpabadunu6. parvathamulapai eMthoa suMdharamulu - raajya suvaarthanu chaatiMchuvaaraiseeyoanu! nee dhaevudaelu chunnaadani - sa maaDhaanamunu prakatiMchu paadhamulu7. aa nagaramuloa nuMdadhu shaapamu - dhaevuni gorrepilla siMhaasanamuMdusaeviMthuru thana dhaasulaayananu - ravi thaejulai dhivi raajyamunMdhu