• waytochurch.com logo
Song # 395

kondharemo gurralantu కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు

కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు

కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ

మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం

కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం

ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు

రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే

ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు

ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే

ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

1 శాపగ్రస్తమైనట్టి సొదమ్మా రాజు అబ్రహాముకు ఆస్తినిచ్చి గొప్ప చేయ చూచెనుగా

ఒక్క నూలుపోగైనా నీది నాకు వద్దంటూ నీవే నన్ను గొప్పజెశావన్న మాట రావద్దంటూ

పిలిచినట్టి తన దేవునే మ్రోక్కేనే అబ్రహాము వాగ్ధాన ఫలముకై ఎదురు చూచుచుండే

అబ్రామా నీ బహుమానం అత్యధికమౌను భయపడకు నేనున్నాను నీ కేడెము నేను

అని ప్రభువు నిబంధన చేసేనుగా సమస్త రాజుల కంటే గొప్ప జేసెనుగా

అనేక జనాన్గామునకు తండ్రిని జేసెనుగా

ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

2 ఐగుప్తీయ సిరి కంటే క్రీస్తు విషయమై నిందా గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషే

అల్పకాల భోగాలు ఫరో రాజ్య యోగాలు వద్దొదంటూ కోట వీడి సహోదరుల శ్రమలను చూచే

మండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే దాస స్రుంకలను తెంచెను

తన వాక్కు నిచ్చి పంపే

ఐగుప్తు గుర్రపు రథముల బలమంతా తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించా

మోషేను దేవుడు నిలిపెనుగా

ఫరోకు దేవుడుగా ప్రభు మోషే నుంచెనుగా చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగా

ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

3 మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటేను యెహోవాను ఆశ్రయించి నమ్ముకొనుట మేలు

సింహ పిల్లలకు అయినా లేమి కలుగుతుందేమో మనకు మాత్రం ఏ మేలు కొదువై యుండనేరదు

బల పరాక్రమము లన్నియు మన ప్రభుని చేతి దానములే

ఐశ్వర్యము గొప్ప ధనము కలిగేది ప్రభుని వల్లే

లోకాన ఘనులను మించే బహుమంచి పేరు రాజులనే శాసించేటి తన ఆత్మా హోరు

మనకిపుడు ఇచ్చునుగా ప్రభువు

మనలను జ్ఞానముతో ప్రభు నిత్యము నింపునుగా సూచన మాహత్కార్యముగా మననుంచెనుగా

ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు

కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ

మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం

కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం

ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు

రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే

ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు

ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com