• waytochurch.com logo
Song # 3958

dhappigonina vaanipai neetin kummarimchunu aa prabhuvaeదప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే



Reference: నేను దప్పిగలవానిమీద నీళ్ళను ... కుమ్మరించెదను యెషయా Isaiah 44:3

పల్లవి: దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే
ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే

1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే
అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే

2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే
తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా

3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె
గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు

4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే
పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే

5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే
ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే

6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే
మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను

7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో
దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు



Reference: naenu dhappigalavaanimeedha neeLLanu ... kummariMchedhanu yeShyaa Isaiah 44:3

Chorus: dhappigonina vaanipai neetin kummariMchunu aa prabhuvae
eMdiyunna bhoomipai jalamul - pravahiMpa jaeyunaayanae

1. vadigala jalamulaloa dhaarin - nirmiMchunu aa prabhuvae
adavulaloa raajabaatalanu - sThaapiMchunu mana prabhuvae

2. mana sMthathipai aathman - kummariMchunu mana prabhuvae
thana aathmaloa vaarini niMpi - nirmiMchunu sMghamugaa

3. neetikaaluvalayodhdha - niravMji chetlavale
gaddiloa yedhugunatlu - vaaru varDhilledharu

4. karuNaapeeTamu pai nuMdi - maatlaadenu mana dhaevudae
paraloakamu nuMdi svaramun vinipiMchenu mana dhaevudae

5. aakaashamu theruvabadagaa - maatlaadenu mana dhaevudae
oka shabdhamuchae thana suthuni - ghanaparachenu mana dhaevudae

6. mMdhasamun dhaevuni prajalu - mMdhiramMdhuMchaganae
mMdhiramun krammenu prabhuni - thaejoamahimMthatanu

7. thana prajalellappudu kreesthun - saeviMthuru harShmuthoa
dhina dhinamu dhaevunikolchi - hallelooya paadedharu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com