• waytochurch.com logo
Song # 3966

idhigoa naenoka noothana kriyanu chaeyuchunnaanuఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను



Reference: ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను యెషయా Isaiah 43:19

పల్లవి: ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను

అను పల్లవి: ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా

1. అడవిలో త్రోవనుజేసి - ఎడారిలో నదులను నేను
ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను

2. నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు
సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను

3. అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు
ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి

4. నూతన సృష్టిగ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి
ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను

5. నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి
ముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్

6. మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి
చెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును

7. పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్
కరుణాసంపన్నుడగు - మన ప్రభువునకు హల్లెలూయ



Reference: idhigoa naenoka noothana kriya chaeyuchunnaanu yeShyaa Isaiah 43:19

Chorus: idhigoa naenoka noothana kriyanu chaeyuchunnaanu

Chorus-2: eenaadae adhi molachunu dhaani naaloachiMparaa

1. adaviloa throavanujaesi - edaariloa nadhulanu naenu
ellappudu samrudhDhigaa - pravahiMpa jaesedhanu

2. naadhu prajalu thraagutaku - naenaraNyamuloa nadhulu
samrudhDhigaa paarunatlu - sruShtiMchedhanu naenu

3. araNyamuloa jMthuvulu - kroorapakShulu sarpamulu
ghanaparachunu sthuthiyiMchunu - dheeni naaloachiMchudi

4. noothana sruShtiga ninujaesi - nee shaaMthini nadhivalejaesi
nanujoochi mahimaparachi - sthuthibaada jaesedhanu

5. naenae dhaevudanani dhelasi - naa kaaryamulanu neravaerchi
muMdhunna vaatikanna - ghanakaaryamulanu jaethun

6. marugaina mannaanichchi - marithellani raathinichchi
chekkedhanaa raathimeedha - noka kroththa naamamunu

7. paraloaka bhaagyMbulu - naraloakamuloa manakosagen
karuNaasMpannudagu - mana prabhuvunaku hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com