• waytochurch.com logo
Song # 3970

ellappudu ellappudu ellappudu smthoashmu yaesu naathoakooda nunnmdhunఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము యేసు నాతోకూడ నున్నందున



Reference: ఎల్లప్పుడు సంతోషముగ ఉండుడి 1 థెస్స Thessalonians 5:16

పల్లవి: ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము
యేసు నాతోకూడ నున్నందున

1. ఎల్లను పెంటతోడ తుల్యము - నరు
లెల్లరును మన్నై పోవుదురు
రంగుగ ప్రియ యేసు మిత్రుడు నాకుండ
మంగళముగ నుందు కొదువలేదు

2. తల్లి దండ్రులాప్తుల్ మరణమైన - నింక
నెల్ల స్నేహియులు గతించినన్
రాజుయేసుక్రీస్తు ప్రకాశమిత్రుడు
కొదువలేదు నాకు దిగులు లేదు

3. కావలివాడు నిద్రపోడు కున్కడు
ఆశ ప్రేమ కలిగినవాడు
పదివేలు కత్తివాతన్ ప్రక్క కూలిన
దిగులొందను నేను భయమొందను

4. ఇహలోహ సత్రంబు నందున్నను - స్వర్గ
గృహము పైన నాకు నిత్యముండున్
అచ్చట శాశ్వతంబుగ నుందుగాన నా
కిచ్చట సతతమని ఎటులందును

5. ఈ నరులు నన్ను బహుతిట్టి దూషించిన
నా పేరు చెరుప ప్రయత్నించిన
బదులు చెప్పను నా నాలుక నెత్తను
యేసు వలె వారి కరుణింతును

6. ఎట్టి శ్రమలు కష్టనష్టములున్న
దుష్ట సైతానుడు ఎదిరించిన
భయపడను నా కపాయము కలుగదు
నా యేసు నాకు జయవీరుడు

7. ఆదరించు వారలాప్తులెల్లరు
ఈ భూతలమును వీడిపోయినను
పరమ ఆదరణ కర్త యేసు వెంట
ప్రేరేపితుడనై ఏగుదు నెల్లడన్

8. నా మిత్రుని చేయిబట్టి - నే నిల్తును
నా శత్రుని జయింతు - ప్రభు శక్తిచే
వాక్య ఖడ్గంబును - విల్లును ధరియించి
విజయంబు నొందెద - వీరునిగా



Reference: ellappudu sMthoaShmuga uMdudi 1 Thessa Thessalonians 5:16

Chorus: ellappudu ellappudu ellappudu sMthoaShmu
yaesu naathoakooda nunnMdhun

1. ellanu peMtathoada thulyamu - naru
lellarunu mannai poavudhuru
rMguga priya yaesu mithrudu naakuMd
mMgaLamuga nuMdhu kodhuvalaedhu

2. thalli dhMdrulaapthul maraNamaina - niMk
nella snaehiyulu gathiMchinan
raajuyaesukreesthu prakaashamithrudu
kodhuvalaedhu naaku dhigulu laedhu

3. kaavalivaadu nidhrapoadu kunkadu
aasha praema kaliginavaadu
padhivaelu kaththivaathan prakka koolin
dhiguloMdhanu naenu bhayamoMdhanu

4. ihaloaha sathrMbu nMdhunnanu - svarg
gruhamu paina naaku nithyamuMdun
achchata shaashvathMbuga nuMdhugaana naa
kichchata sathathamani etulMdhunu

5. ee narulu nannu bahuthitti dhooShiMchin
naa paeru cherupa prayathniMchin
badhulu cheppanu naa naaluka neththanu
yaesu vale vaari karuNiMthunu

6. etti shramalu kaShtanaShtamulunn
dhuShta saithaanudu edhiriMchin
bhayapadanu naa kapaayamu kalugadhu
naa yaesu naaku jayaveerudu

7. aadhariMchu vaaralaapthulellaru
ee bhoothalamunu veedipoayinanu
parama aadharaNa kartha yaesu veMt
praeraepithudanai aegudhu nelladan

8. naa mithruni chaeyibatti - nae nilthunu
naa shathruni jayiMthu - prabhu shakthichae
vaakya khadgMbunu - villunu DhariyiMchi
vijayMbu noMdhedha - veerunigaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com