ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను
Reference: దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రోమా Romans 8:29-30
1. ఎరిగియుంటివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగి
భూమి పునాదులు వేయకముందే
ఆకాశము సహా లేకున్నపుడే
ఇలపర్వతములు నిలవకముందే
కనబడు ప్రతిదియు లేకున్నపుడే - ఎరిగి
2. నిర్ణయించితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణ
పరమున కూటము జరుగకముందే
రక్షణ వెలుగుకు రాకున్నపుడే
ప్రాయశ్చిత్తపు బలికాకున్నపుడే
యేసు రూపమిల్ నేర్పడనపుడే - నిర్ణ
3. పేరున పిల్చితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - పేరున
చేత ఆదామును చేయకముందే
హానోకు నీతో నడువకముందే
నోవాహును రక్షింపకముందే
పిత్రుడబ్రామును పిలువకముందే - పేరున
4. నీతిగ తీర్చితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ
గర్భములో నే కలుగకముందే
కాలపరిమితి కాకున్నపుడే
కటిక చీకటి కాకున్నపుడే
నిర్దేవుడనై నేనుండగనే - నీతిగ
5. మహిమ పరచితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - మహిమ
తేజోమయముగ దివిరాజ్యమున
దూత గణంబులు ప్రీతిగ పొగడ
తరుగని నిత్యతండ్రి మహిమతో
మహిమ రూపుడగు మరియ సుతునితో - మహిమ
Reference: dhaevudevarini muMdhu erigenoa, vaaru thana kumaarunithoa saaroopyamu galavaaravutaku vaarini muMdhugaa nirNayiMchenu. mariyu evarini muMdhugaa nirNayiMchenoa vaarini pilichenu; evarini pilichenoa vaarini neethimMthulugaa theerchenu; evarini neethimMthulugaa theerchenoa vaarini mahimaparachenu. roamaa Romans 8:29-30
1. erigiyuMtivae - yehoavaa
yaesukreesthunMdhu nannu - erigi
bhoomi punaadhulu vaeyakamuMdhae
aakaashamu sahaa laekunnapudae
ilaparvathamulu nilavakamuMdhae
kanabadu prathidhiyu laekunnapudae - erigi
2. nirNayiMchithivae - yehoavaa
yaesukreesthunMdhu nannu - nirN
paramuna kootamu jarugakamuMdhae
rakShNa veluguku raakunnapudae
praayashchiththapu balikaakunnapudae
yaesu roopamil naerpadanapudae - nirN
3. paeruna pilchithivae - yehoavaa
yaesukreesthunMdhu nannu - paerun
chaetha aadhaamunu chaeyakamuMdhae
haanoaku neethoa naduvakamuMdhae
noavaahunu rakShiMpakamuMdhae
pithrudabraamunu piluvakamuMdhae - paerun
4. neethiga theerchithivae - yehoavaa
yaesukreesthunMdhu nannu - neethig
garbhamuloa nae kalugakamuMdhae
kaalaparimithi kaakunnapudae
katika cheekati kaakunnapudae
nirdhaevudanai naenuMdaganae - neethig
5. mahima parachithivae - yehoavaa
yaesukreesthunMdhu nannu - mahim
thaejoamayamuga dhiviraajyamun
dhootha gaNMbulu preethiga pogad
tharugani nithyathMdri mahimathoa
mahima roopudagu mariya suthunithoa - mahim