• waytochurch.com logo
Song # 398

యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా

yehovaa maa balamaa neeve kadha naa dheema

యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా
గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
దేవుని దూతయే కావలి కాయుచు కాచును మా గుడారం
గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
దూతల సైన్యమే రక్షణ వలయమై చేయును మాకు సాయం
మేం రారాజు పిల్లలమై యుండగా పరలోకమే మా వెంట నడవగా
మా ప్రభు మహిమ మా పై కనిపించగా శత్రు ఆయుధము వెనుదిరిగి కూలదా
ప్రభు నీదే మా కవచం ప్రభు నామం మా దుర్గం యేసే మా బలం మా బలం
తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం
యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా
యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా

1 పదివేల మందియే దండెత్తి వచ్చినా భయము మాకు కలుగనియ్యడూ
వేవేల మందియే మా ప్రక్కన కూలినా అపాయము చేరనీయడు
దండె దిగినను లెక్కే చేయము దండె దిగినను లెక్క చేయము
పండుకొని నిద్ర పోతాం మహోన్నతుని చాటున విశ్రమించి మేం విశ్రాంతి పొందుకుంటాం
మేం పండుకొని నిద్ర పోయి లేవగా కనుల ముందు నిలుచు మాకు రక్షణ
శత్రువులను ముంచేసి అస్త్రములను తుంచేసి రాథములను కాల్చేసి
జయము మాకు ఇచ్చినట్టి యేసే మా బలం మా బలం
తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం

2 అభిషిక్త ప్రవక్తలను ముట్టనేరాదని అపవాదికి ఆజ్ఞ ఇచ్చెగా
మము తాకితే తన కంటి గుడ్డు తాకినట్టని శత్రువుని హెచ్చరించెగా
మరణ దూత మమ్మును దాటి వెళ్లి పోవును
మరణ దూత మమ్మును దాటి పోవును యేసుని రక్తం చూచి
ఏ తెగులును మా గుడారము సమీపించనేరదు వచ్చి
వేటకాని ఉరులు ప్రభువు తెంచెను నరకపాశములను తుంచి వేసెను
రాత్రి వేళ భయమైన పగటి వేళ బాణమైన చీకటిలో తెగులైన
హాని మాకు చేయలేవు యేసే హే హే హే మా బలం మా బలం
తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం

3 వడివడిగా శత్రువే వరద వలే పొర్లిన ఆత్మ తానె అడ్డు తగలడం
ఆ శత్రు సేనను యెహోవా దూతయే తరిమి తరిమి తరిమి కొట్టడం
యెరుషలేము చుట్టును పర్వత శ్రేణిలా
యెరుషలేము చుట్టును పర్వత శ్రేణిలా ప్రభువు మా చుట్టుండగా
కదలకుండ నిత్యమూ నిలిచి యుండమా సీయోను కొండలాగా
మా కొండ కోట ఆశ్రయం దేవుడే మేం నమ్ముకొను దేవుడు యేసుడే
శత్రు మంత్ర తంత్రాలు రోగ దుఃఖ శాపాలు అంధకార దెయ్యాలు
అన్ని ఓడగొట్టినట్టి యేసే హే హే హే మా బలం మా బలం
తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం
గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
దేవుని దూతయే కావలి కాయుచు కాచును మా గుడారం
గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్నాం ఆత్మ అగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం
దూతల సైన్యమే రక్షణ వలయమై చేయును మాకు సాయం
మేం రారాజు పిల్లలమై యుండగా పరలోకమే మా వెంట నడవగా
మా ప్రభు మహిమ మా పై కనిపించగా శత్రు ఆయుధము వెనుదిరిగి కూలదా
ప్రభు నీదే మా కవచం ప్రభు నామం మా దుర్గం యేసే మా బలం మా బలం
తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం
యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా
యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com