• waytochurch.com logo
Song # 3980

meerae loakamunaku velugu loakamunaku uppu meeraeమీరే లోకమునకు వెలుగు లోకమునకు ఉప్పు మీరే



Reference: మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. మత్తయి Matthew 5:13-16

పల్లవి: మీరే లోకమునకు వెలుగు
లోకమునకు ఉప్పు మీరే

1. మనుజులు మీదు మంచి క్రియలను
కని తండ్రిని మహిమ పరచగ
వినయమున మీ వెలుగు వారికి
కనబడగా ప్రకాశించుడి

2. కొండమీద నుండు పట్టణము
ఉండనేరదు మరుగైనిజముగ
దండిగ మనదు తండ్రి స్వరూపము
ఉండగ మీలో ప్రకాశించుడి

3. దేవుని వాక్యము వెలుగై యున్నది
జీవించుడి వెలుగును కలిగి
పావనమగు సహవాసము కలిగి
దేవుని ఆత్మలో నిండి వర్థిల్లెదరు

4. మరణచ్చాయలో మీరుండగ
పరమ వెలుగు ప్రకాశించెను
పరిగిడె చీకటి వెలుగుదయించగ
పరిశుద్దాత్మ ఫలములు పొందిన

5. మీరికమీదట పరదేశులును
పరజనులుగ నుండక యుందురు
పరిశుద్దులతో నేకపౌరులై
దేవుని గృహమునై యున్న

6. రాత్రి పగలు భేదము లేక
చంద్రుని సూర్యుని కాంతియు లేక
ప్రభువగు దేవుడు ప్రకాశించును
యుగయుగముల కాయన రాజ్యము

7. ప్రభువగు దేవుడే జీవమై యుండియు
ఉప్పుగా జేసెను మిమ్మును తనకై
ఉప్పును బోలి సారము కలిగి
ప్రభుయేసునకే హల్లెల్లూయ పాడుడి



Reference: manuShyulu mee sathkriyalanu choochi paraloakamMdhunna mee thMdrini mahimaparachunatlu vaariyedhuta mee velugu prakaashiMpaniyyudi. maththayi Matthew 5:13-16

Chorus: meerae loakamunaku velugu
loakamunaku uppu meerae

1. manujulu meedhu mMchi kriyalanu
kani thMdrini mahima parachag
vinayamuna mee velugu vaariki
kanabadagaa prakaashiMchudi

2. koMdameedha nuMdu pattaNamu
uMdanaeradhu marugainijamug
dhMdiga manadhu thMdri svaroopamu
uMdaga meeloa prakaashiMchudi

3. dhaevuni vaakyamu velugai yunnadhi
jeeviMchudi velugunu kaligi
paavanamagu sahavaasamu kaligi
dhaevuni aathmaloa niMdi varThilledharu

4. maraNachchaayaloa meeruMdag
parama velugu prakaashiMchenu
parigide cheekati velugudhayiMchag
parishudhdhaathma phalamulu poMdhin

5. meerikameedhata paradhaeshulunu
parajanuluga nuMdaka yuMdhuru
parishudhdhulathoa naekapaurulai
dhaevuni gruhamunai yunn

6. raathri pagalu bhaedhamu laek
chMdhruni sooryuni kaaMthiyu laek
prabhuvagu dhaevudu prakaashiMchunu
yugayugamula kaayana raajyamu

7. prabhuvagu dhaevudae jeevamai yuMdiyu
uppugaa jaesenu mimmunu thanakai
uppunu boali saaramu kaligi
prabhuyaesunakae hallellooya paadudi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com