• waytochurch.com logo
Song # 3993

vaaru aayana thattu choodagaanae vaariki velugu kaligenuవారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగెను



Reference: వారు ఆయన తట్టుచూడగా వెలుగు కలిగెను కీర్తన Psalm 34:5

పల్లవి: వారు ఆయన తట్టు చూడగానే - వారికి వెలుగు కలిగెను

1. కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు
కాపాడును మనల ప్రతి శోధన నుండి
చూపించు తన మహిమ నిత్యము మనకు
స్థాపించును మనలను తన రాజ్యముగా

2. కనుగొంటివా నీవు దేవుని మహిమ
తన కుమారుడైన యేసు ప్రభువులో
తన ప్రజలను విడిపింప క్రీస్తేసు
తనయుండై యిహమున జన్మించెను

3. అంత్య దినంబు వచ్చుచుండెను చూడు
చింతించెదరు పాపులందరిలలో
చింతించుచు నేడే పశ్చాత్తాపముతో రా
వింత రక్షణను పొంది ఆనందింతువు

4. యెహోవా తేజస్సు ఆయన శక్తితో
మహిమతో మందిరము నిండి యుండెను
మహామహుని పాదముల నేడే వేడిన
మహిమానందము పొంది సంతసింతువు

5. క్రీస్తు యేసు ప్రజలకు యీ భువిని
నీతి సూర్యుడు ఉదయించును మెండుగా
అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును
నిత్యము సంతోష గానము చేతురు

6. రక్షింపబడిన ప్రభుని జనమా
రక్షకుడేసుని స్వకీయ ధనమా
రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంఘమా
ముక్తి దాతను శ్లాఘించి కొనియాడుము



Reference: vaaru aayana thattuchoodagaa velugu kaligenu keerthana Psalm 34:5

Chorus: vaaru aayana thattu choodagaanae - vaariki velugu kaligenu

1. krupaa sathya sMpoorNudagu prabhuvu
kaapaadunu manala prathi shoaDhana nuMdi
choopiMchu thana mahima nithyamu manaku
sThaapiMchunu manalanu thana raajyamugaa

2. kanugoMtivaa neevu dhaevuni mahim
thana kumaarudaina yaesu prabhuvuloa
thana prajalanu vidipiMpa kreesthaesu
thanayuMdai yihamuna janmiMchenu

3. aMthya dhinMbu vachchuchuMdenu choodu
chiMthiMchedharu paapulMdharilaloa
chiMthiMchuchu naedae pashchaaththaapamuthoa raa
viMtha rakShNanu poMdhi aanMdhiMthuvu

4. yehoavaa thaejassu aayana shakthithoa
mahimathoa mMdhiramu niMdi yuMdenu
mahaamahuni paadhamula naedae vaedin
mahimaanMdhamu poMdhi sMthasiMthuvu

5. kreesthu yaesu prajalaku yee bhuvini
neethi sooryudu udhayiMchunu meMdugaa
athani rekkalu aaroagyamu nichchunu
nithyamu sMthoaSh gaanamu chaethuru

6. rakShiMpabadina prabhuni janamaa
rakShkudaesuni svakeeya Dhanamaa
rakthamuthoa konnatti kreesthu sMghamaa
mukthi dhaathanu shlaaghiMchi koniyaadumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com