• waytochurch.com logo
Song # 3999

krupaathishayamul oa naa yehoavaa nithyamun keerthimthunuకృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును



Reference: అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును ఆదికాండము Genesis 15:1

Reference: నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. కీర్తన Psalm 89:34

Reference: ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు. దానియేలు Daniel 7:14

పల్లవి: కృపాతిశయముల్ ఓ నా యెహోవా - నిత్యమున్ కీర్తింతును
తరతరములకు నీ విశ్వాస్యతన్ - తెలియ జేసెదను

1. యెహోవా వాక్కు దర్శనమందు - అబ్రామునకు వచ్చెను
అబ్రామా భయపడకు - 2
నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను - 2

2. నా నిబంధనన్ ఏ నాటికిన్
రద్దుపరచనని పల్కెన్ - మార్చవు నీ మాటను
నీ పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు

3. శాశ్వతమైనదా ప్రభుత్వము - తొలగిపోదే నాటికిన్
లయము కాదు ఆ రాజ్యం
మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము

4. నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి
ఆకాశ తారల వలెన్
సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి

5. దివారాత్రులతో నా నిబంధన
మార్చెదరా మీరు మీరునట్లు - అట్లయిన భంగమగున్
దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి

6. సింహాసనమున దావీదు - సంతతి యుండక మానదు
లేవీయుల్ యాజకులన్
నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి

7. యెహోవా నీ కృప కార్యములన్నియు
వీనుల విందుగ నొప్పుచుండె
శ్లాఘింతున్ మనసారగన్
హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము



Reference: abraamaa, bhayapadakumu; naenu neeku kaedemu, nee bahumaanamu athyaDhikamagunu aadhikaaMdamu Genesis 15:1

Reference: naa nibMDhananu naenu radhdhuparachanu. naa pedhavulaguMda bayaluveLlina maatanu maarchanu. keerthana Psalm 89:34

Reference: aayana prabhuthvamu shaashvathamainadhi. adhennatikini tholagipoadhu. aayana raajyamu eppudunu layamukaadhu. dhaaniyaelu Daniel 7:14

Chorus: krupaathishayamul oa naa yehoavaa - nithyamun keerthiMthunu
tharatharamulaku nee vishvaasyathan - theliya jaesedhanu

1. yehoavaa vaakku dharshanamMdhu - abraamunaku vachchenu
abraamaa bhayapadaku - 2
nee kaedemunu - bahumaanamu naenai yunnaananenu - 2

2. naa nibMDhanan ae naatikin
radhdhuparachanani palken - maarchavu nee maatanu
nee pedhavulathoa palkina dhaanini dhruDamu chaethuvu

3. shaashvathamainadhaa prabhuthvamu - tholagipoadhae naatikin
layamu kaadhu aa raajyM
mahima ghanatha aaDhipathyamunu neevaayen nithyamu

4. nee nibMDhanan dhaaveedhuthoadani laeveeyulathoa jaesithivi
aakaasha thaarala valen
samudhra isuka raeNuvulMthaga jaesedhanMtivi

5. dhivaaraathrulathoa naa nibMDhan
maarchedharaa meeru meerunatlu - atlayina bhMgamagun
dhaaveedhuthoanae jaesinayatti nibMDhanMtivi

6. siMhaasanamuna dhaaveedhu - sMthathi yuMdaka maanadhu
laeveeyul yaajakulan
naa parichaarakulMdharin phaliMpajaesedhanMtivi

7. yehoavaa nee krupa kaaryamulanniyu
veenula viMdhuga noppuchuMde
shlaaghiMthun manasaaragan
hallelooya - sthoathramulathoa - keerthiMthu nithyamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com