idiye samayam ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై
ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా మండే అగ్నై నింగే హద్దై ప్రభు బలము చాటరా లోకంలో ఆ నాడు ప్రభువేలా ఉన్నాడో ఈనాడు నిన్నంతే నియమించి యున్నాడు లెమ్ము ఓ ... లెమ్ము లెమ్ము లెమ్ము తేజరిల్లుము లెమ్ము లెమ్ము తేజరిల్లుము నీ బలమును ధరియించు ఆ దుమ్మును తొలగించు సరికొత్త సూర్యునివై సమరాన్నే సాగించు లెమ్ము ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై 1 చూడుము ఈ భూమిపై చీకటియే కమ్మెనే జనగణములు వెలుగు లేక మూర్చియుండెనే యెహోవా మహిమయే నీ పై ఉదయించెనే ప్రభువు నిన్ను ఏరి కోరెనే లోకానికి వెలుగుగా నీవే ప్రభు జ్యోతిగా కదిలితే చీకటే ఉరకదా లోకమే ప్రభుని వెంట నడవదా భగ భగ భగ మండుచు ప్రభు యేసుని చూపుతూ అడుగు వెయ్ కొండలే కరగవా అపవాది దుర్గ కోటలన్ని కూలవా రాజులే నీ ఉదయ కాంతికొత్తురే జనములే నీ వెలుగు కోరి నడతురే ఓ సోదరా లేవరా యేసుకై అగ్నితో రాగలరా ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై 2 ఎన్నెన్నో వరములు ప్రభుని తలాంతులు ఎన్నాళ్ళు గుంటలో పూడ్చిపెడుదువు ? సంపూర్ణ మహిమలో నడవాల్సిన నీవిలా కొంచెంతో సర్దుకొందువా ? హే ప్రభుని పిలుపు మారునా ప్రభుని వరము తొలగునా కాలమే లోకమే మారినా మారునా ప్రభుని ప్రేమ మారునా ప్రభుని మాట తలచుకో గుండె ధైర్యపరచుకో కోటిలో ఒకడివై లేవరా కోట్ల కోట్ల ప్రజల కళ్ళు తెరవరా హే చెరితనే తిరగరాసే పిలుపు నీదిరా చెరితనే మార్చినట్టి ప్రభుని చూపరా ఓ సోదరా లేవరా యేసు నీకై వేచియుండె రా ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై 3 ఆ చచ్చిన కుక్కయే గర్జించు సింహమై లోకాన్ని మోసపుచ్చి మ్రింగుచుండెనే నీకేమి పట్టనట్టు అధికారం ఇవ్వనట్టు ఎన్నాళ్ళు ఊరకుందువూ ? హే బలము ఉడగ లేదురా నీ చేవ చావా లేదురా లేవరా నిద్ర మత్తు వీడరా సమాధి చీల్చి ప్రభువుతో నడవరా ప్రభుని వైపు చూడరా ఆత్మా శక్తి పొందరా ఆత్మ ఖడ్గమెత్తి పోరాడరా అపవాది క్రియలు లయము చేసి గెలవరా అగ్ని నుండి జనులనే లాగు సోదరా నిన్ను ఆపగాలుగు దమ్ము ఎవడికుంది రా ఓ సోదరా లేవరా యేసుతో ఠీవిగా నడవరా ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా మండే అగ్నై నింగే హద్దై ప్రభు బలము చాటరా లోకంలో ఆ నాడు ప్రభువేలా ఉన్నాడో ఈనాడు నిన్నంతే నియమించి యున్నాడు లెమ్ము ఓ ... లెమ్ము లెమ్ము లెమ్ము తేజరిల్లుము లెమ్ము లెమ్ము తేజరిల్లుము నీ బలమును ధరియించు ఆ దుమ్మును తొలగించు సరికొత్త సూర్యునివై సమరాన్నే సాగించు లెమ్ము ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై ఇదియే సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై