• waytochurch.com logo
Song # 4001

naa priyudu naavaadu naenu athani vaadanuనా ప్రియుడు నావాడు నేను అతని వాడను



Reference: నా ప్రియుడు నావాడు. నేను అతనిదానను. పరమగీతము Song of Songs 2:16

Reference: నీవు బహు ప్రియుడవు దానియేలు Daniel 10:18

Reference: ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి. మత్తయి Matthew 17:5

పల్లవి: నా ప్రియుడు నావాడు నేను అతని వాడను

1. నీవు బహు ప్రియుండవనుచు - దానియేలునకు
దివ్యముగ నభయంబిచ్చిన మా - పరమజనకుండా

2. ఈయనే నా సంతసమైన - ప్రియతనయుండు
ఈయన మాట వినుడనిన - పరమజనకుండా

3. ఎన్ని సంద్రముల జలరాసుల్ - ఆర్పగాలేని
ఉన్నతంబైన నీ ప్రేమన్ - ఎన్న మా తరమా

4. కల్వరిన్ చిందించిన నీదు - రక్త ధారలతో
కడిగితివి మా పాపములన్ని - కరుణగల క్రీస్తు

5. మా పై నపవాది నదిబోలి - పొర్లిపారినను
ముంచి వేయగ జాలదు మమ్ము - మాతో నీ వుండన్

6. క్రొత్త వత్సరమును దానముగా - నిచ్చిన క్రీస్తు
క్షణక్షణం నడిపింతువు మమ్ము - విజయవంతముగా

7. నీదు రాకడ కై దినదినము - వేచియున్నాము
నిత్య మహిమలో నీతో మేము - మెరయుచుందుము



Reference: naa priyudu naavaadu. naenu athanidhaananu. paramageethamu Song of Songs 2:16

Reference: neevu bahu priyudavu dhaaniyaelu Daniel 10:18

Reference: idhigoa eeyana naa priyakumaarudu, eeyana yMdhu naenaanMdhiMchuchunnaanu, eeyana maata vinudi. maththayi Matthew 17:5

Chorus: naa priyudu naavaadu naenu athani vaadanu

1. neevu bahu priyuMdavanuchu - dhaaniyaelunaku
dhivyamuga nabhayMbichchina maa - paramajanakuMdaa

2. eeyanae naa sMthasamaina - priyathanayuMdu
eeyana maata vinudanina - paramajanakuMdaa

3. enni sMdhramula jalaraasul - aarpagaalaeni
unnathMbaina nee praeman - enna maa tharamaa

4. kalvarin chiMdhiMchina needhu - raktha Dhaaralathoa
kadigithivi maa paapamulanni - karuNagala kreesthu

5. maa pai napavaadhi nadhiboali - porlipaarinanu
muMchi vaeyaga jaaladhu mammu - maathoa nee vuMdan

6. kroththa vathsaramunu dhaanamugaa - nichchina kreesthu
kShNakShNM nadipiMthuvu mammu - vijayavMthamugaa

7. needhu raakada kai dhinadhinamu - vaechiyunnaamu
nithya mahimaloa neethoa maemu - merayuchuMdhumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com