dhaevudu dhaeniki shilpiyunu nirmaanakudai yunnaadoaదేవుడు దేనికి శిల్పియును నిర్మాణకుడై యున్నాడో
Reference: ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను. హెబ్రీయులకు Hebrews 11:10పల్లవి: దేవుడు దేనికి శిల్పియును నిర్మాణకుడై యున్నాడో ఆ పట్టణమే నా గురి - నా జీవితకాలమంతా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ1. నా ప్రభు నన్ను ప్రేమించెన్ నాకై సిలువలో మరణించెన్తన రక్తములో నను కడిగెన్ నా పాపమును తొలగించెన్2. ప్రతి క్షణము కృపనిచ్చున్ ప్రతి దినము ప్రభు నడిపించున్ప్రతి వరము ప్రభు మనకిచ్చున్ అతి ఫలము ప్రభు దయచేయున్3. జలములు నాపై లేచినను జలము లపై నే వెళ్ళెదనుజనములు నన్నెదిరించినను జయశాలి ప్రభు జయమిచ్చున్4. ప్రభు నాకిచ్చిన కార్యమును ప్రభు శక్తితో నే జేసెదనుప్రబు నాకిచ్చిన కాలమును ప్రభు కొరకై నే గడిపెదను5. నిశ్చలమైనది పట్టణము నీతితొ నిండిన పట్టణమునిత్యము జీవించెదనచట నిత్యుండగు ప్రభు సన్నిధిలో
Reference: aelayanagaa dhaevudu dhaeniki shilpiyu nirmaaNakudunai yunnaadoa, punaadhulugala aa pattaNamukoraku abraahaamu edhuruchoochuchuMdenu. hebreeyulaku Hebrews 11:10Chorus: dhaevudu dhaeniki shilpiyunu nirmaaNakudai yunnaadoa aa pattaNamae naa guri - naa jeevithakaalamMthaa hallelooya hallelooya hallelooy hallelooya hallelooya hallelooy hallelooya hallelooya hallelooy hallelooya hallelooya hallelooy1. naa prabhu nannu praemiMchen naakai siluvaloa maraNiMchenthana rakthamuloa nanu kadigen naa paapamunu tholagiMchen2. prathi kShNamu krupanichchun prathi dhinamu prabhu nadipiMchunprathi varamu prabhu manakichchun athi phalamu prabhu dhayachaeyun3. jalamulu naapai laechinanu jalamu lapai nae veLLedhanujanamulu nannedhiriMchinanu jayashaali prabhu jayamichchun4. prabhu naakichchina kaaryamunu prabhu shakthithoa nae jaesedhanuprabu naakichchina kaalamunu prabhu korakai nae gadipedhanu5. nishchalamainadhi pattaNamu neethitho niMdina pattaNamunithyamu jeeviMchedhanachata nithyuMdagu prabhu sanniDhiloa