• waytochurch.com logo
Song # 4004

oa prabhuvaa nee saevan chaesedha nithyamuఓ ప్రభువా నీ సేవన్ చేసెద నిత్యము



Reference: యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. కీర్తన Psalm 25:4

పల్లవి: ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము - 2
నీ మాటే వినెద - నరుని మాట వినకుందు - 2

1. శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములు
పైబడుచునున్నవి - బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము

2. బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తం
ప్రోక్షించు నాపైన - నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము

3. లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములు
బెదిరించుచున్నవి - ఆకాశము నుండి - ఆదరించుము నన్ను

4. బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటం
దినదినము నేర్పించు - నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా

5. మెల్లని నీ స్వరమున్ - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్
నా కొరకు చూపించు - నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు

6. పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్
ప్రభునింపు నీ కొరకే - పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు

7. క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము
క్రీస్తే నా ఆశ్రయము - క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము



Reference: yehoavaa, nee maargamulanu naaku theliyajaeyumu. nee throavalanu naaku thaetaparachumu. keerthana Psalm 25:4

Chorus: oa prabhuvaa nee saevan - chaesedha nithyamu - 2
nee maatae vinedha - naruni maata vinakuMdhu - 2

1. shoaDhiMchu svaramulu - vinabaduchununnavi vaeDhiMchu naeramulu
paibaduchununnavi - boaDhiMchu nee maargM - vinipiMchu nee svaramu

2. balamaina shathruvu - baaDhiMchuchunnaadu viluvaina nee rakthM
proakShiMchu naapaina - nee hastha balamuthoa - jayamunu naakimmu

3. loakaashalu nannu - kadhiliMchuchunnavi niraasha samayamulu
bedhiriMchuchunnavi - aakaashamu nuMdi - aadhariMchumu nannu

4. baethaelu dharshanamu - spaShtamugaa choopiMchu penuyaelu poaraatM
dhinadhinamu naerpiMchu - naa kaalamMthayu - nanu nadupu naa prabhuvaa

5. mellani nee svaramun - maDhuramugaa vinipiMchu thinnani nee throavan
naa koraku choopiMchu - nee veluguloa nannu - nithyamu nadipiMchu

6. parishoaDhiMchumu nannu - parishudhDha vaakyamuthoa parishudhDhaathma chaenan
prabhuniMpu nee korakae - parishudhDha sMghamuloa - aMgamugaa DhroaDaparachu

7. kreesthae naa jnYaanamu - kreesthae naa neethiyunu kreesthae naa vijayamu
kreesthae naa aashrayamu - kreesthae naa raaraaju - kreesthae naa sarvamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com