పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే
Reference: నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తన Psalm 86:12
పల్లవి: పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే (2)
1. ఏర్పరచుకోలేదు నేను - ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)
పాపినైన నాకు - ఆయనే రక్షణ నిచ్చెన్ (2)
పరలోక రాజ్యములో - భాగమునిచ్చెన్ (2)
2. నా హృదయ పాపమును - తన రక్తములో కడిగెన్
మృతమైన నా ఆత్మను - జీవింపజేసె ప్రభువు
ఉచితంబుగానే పొందితి - నిత్య జీవం
3. నే పాప బంధములో నుండ - హృదయమశాంతితో నిండె
నా పాప మొప్పుకొనగా - కడిగెను రక్తములో
శాంతి ఆనందముతో - నన్ను నింపెన్
4. వర్ణింపజాలను నేను - ప్రభు యొక్క గొప్ప ప్రేమన్
పాపిని నను ప్రేమించెన్ - మరువలేనా ప్రేమను
ప్రశంసలను పాడెద - ప్రభుకే
5. నిత్య రాజ్యము నన్ను చేర్చ - నిత్య నిబంధన చేసే
సుఖదుఃఖములందైన - ముగింతు నా పరుగున్
స్థిరముగ నుందు పరమును చేరువరకు
Reference: naa poorNahrudhayamuthoa naenu neeku kruthajnYthaasthuthulu chelliMchedhanu. keerthana Psalm 86:12
Chorus: poorNa hrudhaya sthoathramul - chelliMchedha prabhunakae (2)
1. aerparachukoalaedhu naenu - prabhuvae nannaerparachukonen (2)
paapinaina naaku - aayanae rakShNa nichchen (2)
paraloaka raajyamuloa - bhaagamunichchen (2)
2. naa hrudhaya paapamunu - thana rakthamuloa kadigen
mruthamaina naa aathmanu - jeeviMpajaese prabhuvu
uchithMbugaanae poMdhithi - nithya jeevM
3. nae paapa bMDhamuloa nuMda - hrudhayamashaaMthithoa niMde
naa paapa moppukonagaa - kadigenu rakthamuloa
shaaMthi aanMdhamuthoa - nannu niMpen
4. varNiMpajaalanu naenu - prabhu yokka goppa praeman
paapini nanu praemiMchen - maruvalaenaa praemanu
prashMsalanu paadedha - prabhukae
5. nithya raajyamu nannu chaercha - nithya nibMDhana chaesae
sukhadhuHkhamulMdhaina - mugiMthu naa parugun
sThiramuga nuMdhu paramunu chaeruvaraku