• waytochurch.com logo
Song # 4013

adavi chetla naduma oka jaldharu vrukshm valeఅడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె



Reference: అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పరమగీతము Song of Songs 2:3

పల్లవి: అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు (2)

అను పల్లవి: కీర్తింతున్ నా ప్రభుని - జీవకాలమెల్ల ప్రభుయేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)

1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే
అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్ఠుడు (2)

2. పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా
నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్

3. మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి

4. నా త్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే

5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత

6. నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడని - భయపడకు మని అంటివి



Reference: adavi vrukShmulaloa jaldharu vrukShmetlunnadhoa paramageethamu Song of Songs 2:3

Chorus: adavi chetla naduma - oka jaldharu vrukShM vale
parishudhDhula samaajamuloa - yaesu prajvaliMchuchunnaadu (2)

Chorus-2: keerthiMthun naa prabhuni - jeevakaalamella prabhuyaesuni
kruthajnYthathoa sthuthiMchedhanu (2)

1. Shaaroanu roajaa aayanae - loaya padhmamunu aayanae
athi parishudhDhudu aayanae - padhivaelaloa athishraeShTudu (2)

2. parimaLathailM nee naamM - dhaani vaasana vyaapiMchegaa
niMdhashrama sMkatamulaloa - nanu sugMDhamugaa chaeyun

3. manoavaedhana sahiMchalaeka - siluvavaipunae choodagaa
laevaneththi nanneththukoni - bhayapadakumani yMtivi

4. naa throavaku dheepM neevae - naa brathukuku jeevM neevae
naa saevaku balamu neevae - naa aathmakaadharaNaneevae

5. ghanamaina naa prabhuvaa - nee raktha prabhaavamun
naa hrudhayamu kadigithivi - neekae naa sthuthi ghanath

6. neevu naa dhaasudavaniyu - aerparachukoMtinani
naenae nee dhaevudani - bhayapadaku mani aMtivi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com