yaesu naamamunae paapiki rakshna sarvajagamu nmdhuయేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము నందు
Reference: మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ (ప్రభువైన యేసు నామముననే) నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అపొస్తలుల కార్యములు Acts 4:12పల్లవి: యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2)అను పల్లవి: ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2)1. ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్2. పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింపదేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్3. పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే4. పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములోఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో