• waytochurch.com logo
Song # 4019

yaesu naamamunae paapiki rakshna sarvajagamu nmdhuయేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము నందు



Reference: మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ (ప్రభువైన యేసు నామముననే) నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అపొస్తలుల కార్యములు Acts 4:12

పల్లవి: యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2)

అను పల్లవి: ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2)

1. ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్
మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్

2. పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప
దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్

3. పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్
మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే

4. పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో
ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో



Reference: mari evanivalananu rakShNa kalugadhu; ee (prabhuvaina yaesu naamamunanae) naamamunanae manamu rakShNa poMdhavalenu gaani, aakaashamu kriMdha manuShyulaloa iyyabadina mari ae naamamuna rakShNa poMdhalaemu aposthalula kaaryamulu Acts 4:12

Chorus: yaesu naamamunae paapiki rakShNa - sarvajagamu nMdhu (2)

Chorus-2: aakaashamu kriMdha maanavulaloa ae paeruna mukthi laedhu (2)

1. ee jagathikae theMchi rakthamu kaarchi - baligaa narpiMchukonen
manala rakShiMpa sMthoaShmivva - siluvaloa bali aayen

2. paapamu nuMdi shaapamu nuMdi - manalanu vidipiMp
dhaevaadhi dhaevudu maanava roopamu - dhaalchiyilaku vachchen

3. paapula korakai rakthamu kaarchi - siluvaloa maraNiMchen
maraNamu jayiMchi samaaDhini gelachi - vijayuMdaaye yaesae

4. paapamu uMdadhu - bhayamu uMdadhu yaesayya raajyamuloa
ee prabhuvae manathoa nuMdunugaa - paraloaka raajyamuloa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com