entho vintha entho chintha ఎంతో వింత ఎంతో చింత యేసునాధున్ మరణమంత
ఎంతో వింత ఎంతో చింత -యేసునాధున్ మరణమంత=పంతముతోఁ జేసిరంతా-సొంత ప్రజలూ యేసునంత !!ఎంతో!!1.పట్టి కట్టి నెట్టి కొట్టి-తిట్టి రేసునాధు నకటా=అట్టి శ్రమలనొంది పలుక-డాయె యేసు రేడునాడు !!ఎంతో!!2.మొయ్యలేని మ్రాను నొకటి-మోపిరేసు వీపుపైని =మొయ్యలేక మ్రానితోడ-మూర్చబోయేఁ నేసు తండ్రి !!ఎంతో!!3.కొయ్యపై నేసయ్యను బెట్టి-కాలు సేతులలోఁ జీలల్=కఠినులంతగూడి కొట్టిరి-ఘోరముగ క్రీస్తేసున్ బట్టి !!ఎంతో!!4.దాహముగొనఁ జేదుచిరకఁ-ద్రావ నిడిరి ద్రోహులకటా=ధాత్రిఁ ప్రజల బాధకోర్చి -ధన్యుడా దివికేగె నహహా!!ఎంతో!!5.బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ - బారె నీరు రక్త మహహా=యేరై పారె యేసు రక్త-మెల్ల ప్రజల కెలమి నొసగు!!ఎంతో!!