• waytochurch.com logo
Song # 4021

vilapimthuvaa nehemyaavale vilapimthuvaa ejraavaleవిలపింతువా నెహెమ్యావలె విలపింతువా ఎజ్రావలె



Reference: ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని. నెహెమ్యా Nehemiah 1:4

Reference: ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఎజ్రా Ezra 10:1

పల్లవి: విలపింతువా నెహెమ్యావలె? - విలపింతువా ఎజ్రావలె? (2)
కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో
పడిపోయిన ప్రభుని యింటిని గూర్చి విలపింతువా? (2)

1. ఆత్మీయ గ్రహింపు లేకయే
ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి
ఎటుచూచిన ప్రభు యిల్లు పడిపోయెను
ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి

2. అగ్నిచే కాల్చబడిన గుమంబులన్
పడిపోయిన ప్రాకారమున్
పునహ్నిర్మించి నిందను తొలగించెదమా?
ప్రభు హస్తంబుతోడుండగన్

3. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో
ఆత్మకలిగించు ఐక్యతతో
ఒకరినొకరు క్షమించి, సహించుచూ
ప్రభు ప్రత్యక్షత పొందెదమా?

4. నెహెమ్యావలె హృదయంబుల చింపుకొని
పశ్చాత్తాపముతో ప్రభుని చేరి
ఒక చేత ఆయుధము పట్టుకొని
ప్రభుయింటిని కట్టెదమా



Reference: ee maatalu vininappudu naenu koorchuMdi yaedchi, konni dhinamulu dhuHkhamuthoa upavaasamuMdi, aakaashamMdhali dhaevuni yedhuta vijnYaapana chaesithini. nehemyaa Nehemiah 1:4

Reference: ejraa yaedchuchu dhaevuni mMdhiramu edhuta saaShtaaMgapaduchu, paapamunu oppukoni praarThanachaesenu. ejraa Ezra 10:1

Chorus: vilapiMthuvaa nehemyaavale? - vilapiMthuvaa ejraavale? (2)
koorchuMdi dhuHkhamuthoa upavaasamuthoa
padipoayina prabhuni yiMtini goorchi vilapiMthuvaa? (2)

1. aathmeeya grahiMpu laekayae
aathma aikyMbu koalpoathimi
etuchoochina prabhu yillu padipoayenu
prabhu prathyakShtha koalpoathimi

2. agnichae kaalchabadina gumMbulan
padipoayina praakaaramun
punahnirmiMchi niMdhanu tholagiMchedhamaa?
prabhu hasthMbuthoaduMdagan

3. aathmeeya praema sahavaasMbuthoa
aathmakaligiMchu aikyathathoa
okarinokaru kShmiMchi, sahiMchuchoo
prabhu prathyakShtha poMdhedhamaa?

4. nehemyaavale hrudhayMbula chiMpukoni
pashchaaththaapamuthoa prabhuni chaeri
oka chaetha aayuDhamu pattukoni
prabhuyiMtini kattedhamaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com