• waytochurch.com logo
Song # 403

aha mahathma haa sareera ఆహా మహాత్మ .హా శరణ్యాహా విమోచకద్రోహ


ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా! విమోచక=ద్రోహ
రహిత చంపె నిను నా-దోషమే గదా[యాహా]

1."వీరలను క్షమించు తండ్రి-నేర రేమియున్"= కోరి
తిటులు నిన్ను జంపు-క్రూరజనులకై [యాహా]

2."నీవు నాతో బరదైసున-నెదె యుందువు"=పావనుండ
యిట్లు బలికి-పాపి గాచితి [యాహా]

3."అమ్మా!నీ సుతుడ" టంచు మరి-యమ్మతో బలికి=
క్రమ్మర "నీ జనని"యంచు-గర్త నుదివితి [యాహా]

4."నా దేవ దేవ యేమి విడ-నాడితి"వనుచు=శ్రీ దేవసుత
పలికితివి శ్రమ-చెప్ప శక్యమా [యాహా]

5."దప్పిగొనుచున్నా"నటంచు-జెప్పితివిగదా=యిప్పగి
దిని బాధనొంద-నేమి నీకు హా! [యాహా]

6."శ్రమ ప్రమాదములను గొప్ప శ్బ్దమెత్తి హా=సమ్మప్త
మైన" దంచు దెలిపి-సమసితివి గదా [యాహా]

7."అప్పగింతు దండ్రి నీకు-నాత్మ"నంచును=గొప్ప
యార్భాటంబు చేసి-కూలిపోతివా [యాహా]


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com